ఏ షో కి చేయని పనిని సుమ..క్యాష్ ప్రోగ్రామ్ కోసం చేస్తుంది..అదేంటో తెలుసా…?

సుమ ..సుమ ..సుమ బుల్లితెరపై ఏ షో అయినా ఈవెంట్ అయినా సరే ఈ పేరు మొదటగా వినిపిస్తుంది . ఈమె కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ చేతికి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ స్టైల్ తో స్టార్ హీరోయిన్ సైతం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుమ.. జీ తెలుగు ,ఈటీవీ ,మాటీవీ పలు ఈవెంట్స్ లో అన్నీ షోస్ ని కవర్ చేస్తుంది. మరీ ముఖ్యంగా సుమ ఎక్కువగా ఈటీవీ షోలో క్యాష్ ప్రోగ్రాంలో కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా చేస్తూనే ఉంది.

కాగా సుమ పలు షోస్ కి.. యాంకర్ గా ఈవెంట్స్ కి యాంకర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ సుమ ఏనాటి రెమ్యూనరేషన్ ఆరోజు చెక్ రూపంలో అందుకుంటుందట. కానీ క్యాష్ షోకి మాత్రం ముందుగానే తీసుకునేస్తుందట. అలా తీసుకొని ఆ తర్వాత షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకుంటుందట . అంతేకాదు సుమ ఒక్క రోజే నాలుగు ఎపిసోడ్లను కవర్ చేస్తుందట . అందుకే సుమని తప్పిస్తే క్యాష్ ప్రోగ్రామ్ కు ఎవర్ని యాంకర్ గా పెట్టడానికి ఈటీవీ ఒప్పుకోవట్లేదు.

అంతేకాదు..సుమ ఒక్క ఎపిసోడ్ కి మూడు లక్షలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. అలా ఒక్క రోజే సుమ 12 లక్షలు సంపాదిస్తుంది . నిజానికి అయితే ఏ షో అయిపోయాక ఆ షో సంబంధించిన చెక్ తీసుకుంటుంది సుమ. కాని దీనికి మాత్రం ఒక్కసారిగా 60, 70 లక్షలు తీసుకుని దానికి తగ్గ రేంజ్ లో ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకుంటుందట. ఈ విషయం తెలిశాక అభిమానుల షాక్ అయిపోతున్నారు. సుమ ఒక్క షోకే రెండు మూడు అంటే సుమ ఆస్తి ఎన్ని కోట్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest