ఉమామహేశ్వరి ఆత్మహత్యపై.. గుట్టు రట్టు చేసిన లక్ష్మీపార్వతి..!!

ఆగస్టు 1వ తేదీన నందమూరి తారక రామారావు నలుగురు కూతుర్లలో చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి , కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నిన్న బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిసాయి. ఉమామహేశ్వరి మొదటి భర్త నుంచి వస్తున్న ఒత్తిడి , మానసిక ఇబ్బందుల వల్ల అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి అసలు విషయాన్ని బయటపెట్టి సంచలన వ్యాఖ్యలు తెలియజేశారు.Uma Maheshwari: ఉమామహేశ్వరి ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణమా..? - BigBoss  News

ఇకపోతే తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయంటూ ఆమె స్పష్టం చేశారు. ఉమా మహేశ్వరి మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూనే.. అసలు ఏం జరిగింది అనేది ఇంకా మిస్టరీగానే ఉందని తెలిపారు . ముఖ్యంగా చంద్రబాబు నీచ రాజకీయాల గురించి తెలిసినవారు ఈ విషయంలో అనుమానించక తప్పదు అని , ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడు అని ఆమె విమర్శించారు. ఒక ఒకప్పుడు సింహ గర్జనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన పనుల వల్లే గుండెపోటుతో మరణించారు. ఆయన బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయించి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నాడు అని చంద్రబాబుపై తీవ్రంగా ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి.Lakshmi Parvathi Comments | Lakshmi Parvathi Comments : ఎన్టీఆర్  కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందన్న లక్ష్మీపార్వతి | ABP Desam

మానసికంగా హరికృష్ణ ను ఎన్నో ఇబ్బందులు పెట్టారని అందుకే ఈరోజుకీ కూడా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడరని తెలిపారు. ఇక ఉమామహేశ్వరి మరణం కూడా మిస్టరీగానే ఉందని సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అవుతున్నాయని కూడా తెలిపారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా కొన్ని నమ్మేవి ఉన్నాయి అయితే ఉమామహేశ్వరి ఒక లేఖ రాసి ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు. కానీ చంద్రబాబు రంగ ప్రవేశం చేశాక ఆ లేఖ కూడా మాయం చేసింటారు అని ఆమె ఆరోపించారు. ఇక ఒకరకంగా చెప్పాలంటే ఆస్తి వివాదాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం.. నీ కొడుకును అందడం ఎక్కించడానికి నువ్వు ఏదైనా చేస్తావు అంటూ ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు. అంతేకాదు చంద్రబాబు వల్లే ఈమె మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందేమో అంటూ లక్ష్మి పార్వతి కూడా తన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.