చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?

బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్ర‌మంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాంగ్మూలంఇ చ్చినట్టు తెలుస్తుంది.

Ranveer Singh's Photoshoot For PAPER Magazine: Is The Naked Body Obscene? | Feminism in India

అదే క్రమంలో రణవీర్ సింగ్ తన నూడ్‌ ఫోటోషూట్ పై లిఖితపూర్వకంగా సమాధానాన్ని పోలీసులకు సమర్పించారు. ఆ సందర్భంలోనే రణవీర్ పోలీసులకు వాంగ్మూలాన్ని ఇస్తూ ..”తప్పేముంది నేను నాకు అనిపించింది చేసాను అంతే..”అంటూ పోలీసులకు ఘాటుగా జవాబు ఇచ్చారట.

Ranveer Singh nude photoshoot controversy: PIL filed in the court to seize all printed copies of the magazine

ఇంకా ఏ వివరాలు కావాలన్నా తాను మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పారట. రణవీర్ సింగ్ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయ‌టానికి ఏకంగా రెండు గంటల సమయం తీసుకున్నారట. అంతేకాదు ఇలా మాట్లాడినందుకు కూడా ఆయనపై మహిళా సంఘాలు సోషల్ మీడియా ద్వార‌ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ పై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. వెంటనే ఆయనను పోలిస్ స్టేషన్ కు హాజరు అవ్వాలంటూ ఆగస్టు 22 నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే రణవీర్..” నాకు కొంత సమయం కావాలి” అని అడగక పోలీసులు ఆగస్టు 30 వ‌ర‌కు సమయం ఇచ్చారు. దీంతో ఈరోజు రణవీర్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Latest