హరి హర వీరమల్లు రిలీజ్ డేట్.. ఆరోజున వస్తే సినిమా హిట్టే..!

విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు..

ఒక చారిత్రాత్మక అంశంతో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా తెరపైకి వస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది.. హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు. అయితే అందుకు తగ్గ కసరత్తులు చేయట్లేదు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ కూడా కొనసాగడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ ఆపేసి మరొక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అంతేకాదు కంటెంట్ విషయంలోనూ పవన్ కొంచెం అప్సెట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి చెందారు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని పలుమార్లు మార్చారు. ఈక్రమంలో సినిమా నిర్మాత ఎ.ఎమ్.రత్రం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. 2023 మార్చి 30వ తేదీన హరి హర వీరమల్లు విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ఈ డేట్ పై అభిమానుల్లో ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. ఆ రోజున సినిమా వస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఆ డేట్ కి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా కూడా అదేవిధంగా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.. మరీ ఈ సెంటిమెంట్ సక్సె అవుతుందో లేదో చూడాలి..