Bigg Boss 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss 6 త్వరలో రాబోతుందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 4 నుంచి Bigg Boss 6 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఒక్కటే కన్ఫ్యూజన్. ఈసారి ఈ షోలోకి మొత్తం ఎంతమంది వస్తారు? ఎవరెవరు వస్తారు? అని. ఆ విషయం ప్రస్తుతం రివీల్ అయింది. ఈ షోలోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో 10 మంది అమ్మాయిలు.. 9 మంది అబ్బాయిలు ఉండబోతున్నారు. ఇందులో ఫేమస్ సెలబ్రెటీలతోపాటు.. యూట్యూబర్స్, బుల్లితెర నటీనటులు ఉండనున్నారు.

ఇప్పటికే ఈ షోలో సందడి చేయనున్న కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టగా తాజాగా ఆఫీసియల్ లిస్ట్ బయటికొచ్చింది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ‘గీతు’ ఈసారి బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనుంది. తన మాటలతో, చేష్టలతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న గీతూ.. ప్రస్తుతం జబర్థస్త్ కామెడీ షోలో పాల్గోంటుంది. అలాగే.. యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా బిగ్‏బాస్ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యాడు ఆదిరెడ్డి. అలాగే ఫేమస్ యాంకర్ ఉదయభాను సైతం ఈసారి బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనుందట. బుల్లితెర ప్రేక్షకులకు ఉదయభాను పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అలాగే జబర్ధస్థ్ కమెడియన్ చలాకీ చంటి కూడా ఈసారి బిగ్‏బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ గా రానున్నారట. ఇక బిగ్‏బాస్ సీజన్ 5లో సందడి చేసిన సిరి ప్రియుడు శ్రీహాన్ ఈ సీజన్లో రాబోతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియురాలు సిరిని గెలిపించుకునేందుకు అప్పట్లో శ్రీహాన్ చాలా ప్రయత్నించాడు. ఇక వీరే కాకుండా.. యాంకర్ నేహా చౌదరీ కూడా బిగ్‏బాస్ కంటెస్టెంట్ గా రాబోతుందట. ఈమె ఐపీఎల్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఐపీఎల్ వ్యాఖ్యతగా పాపులర్ అయ్యింది. వీరే కాకుండా.. ప్రముఖ సింగర్ గీతామాధురి భర్త నందు, యూట్యూబర్ నిఖిల్, ఆర్జే సూర్య వంటివారు ఈసారి సందడి చేయనున్నారు.