టాలీవుడ్‌లో ఈ బ్యాచిల‌ర్ హీరోల పెళ్లిళ్లలో ఇంత క‌థ దాగి ఉందా…!!

ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్.. కరోనా రాకముందు టాలీవుడ్ లో పెళ్లికి రెడీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్టు ఎక్కువగా ఉండేది . కానీ కరోనా తర్వాత అది కొంచెం వరకు తగ్గిందని చెప్పవచ్చు. చాలామంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కడమే కాదు అప్పుడే తల్లిదండ్రులు కూడా అయిపోతున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే పెళ్లికి రెడీగా ఉన్న బ్యాచిలర్ హీరోల లిస్టు ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ను మొదలుకొని యంగ్ హీరో రాజ్ తరుణ్ వరకు చాలామంది హీరోలు పెళ్లికి రెడీగా ఉన్నారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది పెళ్ళికి సిద్ధమవుతుంటే మరికొంతమంది అప్పుడే పెళ్ళా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.Prabhas calls sharwa superstar- The New Indian Expressఇలాంటి లిస్టులో ముందుగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు వినిపిస్తుంది. ఈయన తోటి వాళ్ళు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా వివాహం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో అయితే ఒక్కొక్కరు ఇద్దరేసి చొప్పున పిల్లలకు కూడా జన్మనిచ్చారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి ప్రస్తావనపై దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన పై వార్తలు వినిపిస్తున్నా.. ఆయన మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఈయన పేరు తర్వాత రానా ఆ లిస్టులో ఉండేవారు. రానా సెకండ్ వేవ్ లో పెళ్లి పీటలు ఎక్కేసాడు. ఇక ఇప్పుడు తర్వాత పేరు శర్వానంద్ అలాగే రామ్..Ram Pothineni replaces Ram Charan In Trinadh Rao Direction

ఇటీవల రామ్ తన చిన్నినాటి స్నేహితురాలును పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కథనాలు వినిపించినా.. అందులో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత లిస్టులో ఉన్న హీరోలు మెగా హీరో సాయిధరమ్ తేజ్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . ఇద్దరు హీరోలకు సంబంధించి పెళ్లి ప్రయత్నాలను వీరి ఫ్యామిలీలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి మాట ఎక్కడ వినిపించలేదు. ఇక యంగ్ హీరోలైన నితిన్, నిఖిల్ వంటి వారు కూడా వివాహం చేసుకోవడంతో.. ఈ లిస్టులో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కి పెళ్లి కి వేళ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరి గ్రూపులోనే ఒక యంగ్ హీరో త్వరలో పెళ్లి పీటలు లేకపోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ వార్త నిజం అయ్యేవరకు ఎదురు చూడక తప్పదు.

Share post:

Latest