#HarGharTiranga: మన దేశ భక్తి ఇలా తగలాడింది మోడీ గారు..!?

HarGharTiranga.. అనే పేరుతో జనాల్లో అంతరించిపోతున్న దేశభక్తి మరియు జాతీయవాదాన్ని పెంపొందించడానికి అలాగే ప్రోత్సహించడానికి మన దేశ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు.. చేసిన కొత్త ప్రయత్నమే ఇది. నిజానికి హర్ ఘర్ తిరంగా ప్రచారానికి దేశంలో మంచి స్పందన లభించింది. ఇన్నాళ్ళు మన దేశ జెండాని మర్చిపోయిన జనాలు..దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పలువురు తమ ఇళ్లు, సంస్థలపై జెండాను ఎగురవేసి..మేము ఇండియన్స్ అంటూ స్వాతంత్రదినోత్సవం నాడు రొమ్ములు చాచి స్టేటస్ లు పెట్టి చెప్పుకొచ్చారు.

వామ్మో.. #HarGharTiranga పేరుతో జనాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్వాతంత్ర దినోత్సవానికి వారం రోజుల ముందు నుండే పక్క ప్లానింగ్ తో జెండా స్టైల్ లో ఉండే రంగుల డ్రెస్లను వేసుకుని..మేము ఇండియన్స్..#Proud To be Indians అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. HarGharTiranga.. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంబరపడిపోయారు. ఓకే అంత వరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆ జెండాలను ఏం చేసారు..?

అదే అసలు మ్యాటర్. ఆగస్టు 15న మాత్రం ఇంటి పై జెండా లు ఎగరవేసిన జనాలు..ఆ తరువాత ఆ జెండాను ఎవ్వరికి నచ్చిన్నట్లు వాడు వారుతున్నారు. కొందరు టవల్ లా..మరికొందరు చపాతి పై కప్పే గుడ్డలా..మరి కొందరు ఇది మనకు ఎందుకు పనికి వస్తుంది అనుకున్నారు ఏమో..ఏకంగా.. చెత్త కుప్పలో వేసారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

స్వాతంత్ర దినోత్సవం ముందు వరకు దేశ జనాభాలో ఉన్న దేశ భక్తి..స్టేటస్ లు అయిపోగానే..ఇలా చెత్త కుండీలోకి వెళ్ళిపోయాయి మోడీ గారు అంటూ..కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో తప్పు ఎవ్వరిది అంటారు..#HarGharTiranga.. పేరుతో మన దేశ స్ధితిని మారుద్దాం అనుకున్న మోడీ గారి దా..? లేక స్టేటస్ ల కోసం మన జెండా ను వాడుకుని పడేసిన కొందరు ఇండియన్స్ దా..?