సిగరెట్ తో కాల్చడం.. వేధింపులు..చివరికి ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ చిన్న కూతురు..!!

ప్రముఖ స్వర్గీయ నందమూరి తారక రామారావు – బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం కాగా అందులో నలుగురు అమ్మాయిలు.. వారిలో కంఠమనేని ఉమామహేశ్వరి చివరి సంతానం. ఇక నిన్న మధ్యాహ్నం సమయంలో ఆమె తన ఇంటిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీని కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఈమె మరణ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా శోకసంద్రంలో మునిగిపోవడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఇకపోతే ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కూతురు దీక్షిత మీడియాతో వెల్లడించారు. కానీ గత కొంతకాలంగా ఆమె తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.LIVE: NTR's daughter Uma Maheswari found hanging from ceiling fan -  Suicide? WATCH Zee Telugu LIVE for latest news | Zee Business

ఇక మరొక బాధ కలిగించే విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ మొదట నరేంద్ర రాజన్ అని వ్యక్తికి ఇచ్చి ఉమామహేశ్వరి పెళ్లి జరిపించారట. కానీ అతడు చాలా సాడిస్టీ అని.. ఎంతో క్రూరంగా ప్రవర్తించేవాడని నిత్యం ఆమెను వేధిస్తూనే సిగరెట్టుతో కాల్చేవాడని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోని తీవ్ర స్థాయిలో మానసికంగా, శారీరకంగా ఈమెను హింసించేవాడట. ఇక ఎన్టీఆర్ వంటి మహోన్నత కుటుంబం నుంచి వచ్చిన ఉమామహేశ్వరి కి కూడా ఇలా అత్తగారింటి తిప్పలు తప్పలేదని తెలుస్తోంది . ఇక దీంతో ఆమె బాధలు భరించలేక తండ్రితో చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ విషయం తెలుసుకున్నాక మరో మాట లేకుండా అతనితో విడాకులు ఇప్పించి, శ్రీనివాసప్రసాద్ అనే వ్యక్తితో రెండో వివాహం జరిపించారు. ఇక వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

రెండవ వివాహం వల్ల ఆమెకు ఎటువంటి మానసిక ఇబ్బంది లేకపోయినా.. గత జ్ఞాపకాలు మాత్రం ఆమెను నిత్యం వెంటాడుతూనే ఉండేవట. ఇక ఆ కారణంగానే ఆమె తీవ్ర స్థాయిలో మానసికంగా కృంగిపోయి.. అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుందని సమాచారం.. ఇకపోతే విడాకులు తర్వాత కూడా ఆమె ఇన్ని కష్టాలకు గురికావాల్సిన అవసరం ఏముంది? రెండవ భర్తకు తెలియకుండానే ఆమె ఇంత చిత్రవధ భరించిందా? ఇలా ఎన్నో విషయాలు సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కానీ ఒక రాష్ట్రాన్ని శాసించిన మాజీ సీఎం కూతురు జీవితం ఇలాంటి దుర్భరంగా సాగడం సాధారణ ప్రజల హృదయాలను బరువెక్కిస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఉమామహేశ్వరి జీవితంలో ఇంత నరకయాతన పడిందా? అంటూ ప్రతి ఒక్కరు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.