ఒక్కే ఒక్క మాటతో ముగ్గురు హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ …రౌడీ హీరో అనిపించుకున్నాడుగా..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పరిస్ధితులు మారుతూనే ఉంటాయి. నేడు హీరో గా ఉన్న వాడు..రేపు జీరో గా మారిపోతాదు. స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్..అడ్రెస్ లేకుండా పాతాళానికి పడిపోతుంది. ఇలా జరిగిన సంధర్భాలు ఉన్నాయి. ఏదైన ఆ హీరో, హీరోయిన్ లక్..ఒక్క సినిమా వాళ్ళ తల రాతనే మార్చేస్తుంది. హిట్ అయితే సార్ అని పిలిచే వాళ్ళే..ఫ్లాప్ అయితే పక్కన నిల్చున్న చీదరించుకుంటారు . అందుకే మనం సినీ ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఆచి తూచి అడుగులు వేయాలి. మరి ముఖ్యంగా సినీ స్టోరీల విషయంలో..

సినీ ఇండస్ట్రీలో ఒక్క హీరోని ఊహించుకుని అనుకుని కధను రాసి..ఆ కధను మరో హీరోతో తెరకెక్కించిన డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. కొందరు హీరోలు ఇష్టం లేక మంచి కధలు వదులుకుంటే..ఇంకొందరు టైం లేక వదులుకుంటారు. ఇప్పుడు అలా నే పూరీ జగన్నధ్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన మూవీని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరో లు రిజెక్ట్ చేసారు. అది కూడా సేమ్ రీజన్ తో కావడం ఆశ్చర్యకరం. విజయ్ లైగర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం…

అల్లు అర్జున్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా పూరీ-బన్నీ కాంబో పై కూడా మంచి రివ్యూలు ఉన్నాయి. దీంతో ఫస్ట్ లైగర్ కధను బన్ని కి చెప్పారట పూరీ. బాడీ కూడా ధిట్టగా బలంగా ఉండటంతో కధకు సరిపోతాడు అనుకున్నారట. కానీ, బన్ని పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ లో బిజీ..డేట్లు కూడా ఇచ్చే పరిస్ధితులో లేడు ..అందుకే ఈ సినిమాను వదులుకున్నాడట.

NTR: నందమూరి నట వారసుడు NTR గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ లు అవసరం లేదు. కధ నచ్చితే కమిట్ మెంట్ ఇచ్చేస్తాడు. కానీ , ఈ సారి జక్కన చేతిలో చిక్కుకునేసాడు. RRR సినిమా కోసం లైగర్ ను వదులుకున్నాడు, మనకు తెలిసిందే..జక్కన్న తో సినిమా అంటే మూడు సంవత్సరాలు కాల్ షీట్లు ఎక్స్ పెక్ట్ చేయలేం. అలా ఈ సినిమాను తారక్ వదులుకోవాల్సి వచ్చింది.

ప్రభాస్: ఆఖరికి ఈ కధ పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతికి వెళ్లిందట. పూరీ తో ప్రభాస్ ఫ్రెండ్ షి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..జాన్ జిగిడి దోస్త్లు. పూరీ కధ చెప్పినప్పుడు ప్రభాస్ కి ఈ స్టోరీ నచ్చిందట. కానీ ప్రభాస్ మిగత బడా ప్రాజెక్ట్స్ కే అన్ని కాల్ షీట్లు ఇచ్చేశాడు. అయినా కానీ పురీతో..టైం ఇవ్వు డార్లింగ్ ఖచ్చితంగా చేస్తాం అన్నారట. ప్రభాస్ కమిట్ అయిన మూవీల లిస్ట్ చూస్తే దాదాపు నాలుగేళ్ళ వరకు సినిమా ని ఎక్స్ పెక్ట్ చేయలేం. దీంతో ప్రభాస్ కూడా సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

ఇక ఫైనల్లీ అదృష్టం రౌడీ హీరోకి వరించింది. పూరీ అనుకోకుండా విజయ్ కి ఈ స్టోరి చెప్పడం ఆయనకి నచ్చడం..సెకండ్ డే నే అగ్రిమెంట్ పై సైన్ చేయడంతో పూరీ కూడా షాక్ అయ్యారట. అప్పటికే పూరీ కి ఫేడ్ అవుట్ డైరెక్టర్ అని ముద్ర వేసేసింది టాలీవుడ్. అయినా కానీ, విజయ్ నమ్మి సినిమా కోసం కమిట్ అయ్యి..మిగతా సినిమాలను వదులుకున్నాడు. ఇలా పూరి కి యస్ చెప్పి..రౌడీ హీరో అనిపించుకున్నాడు. మరి చూడాలి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?

Share post:

Latest