తమ విడాకులపై మొదటిసారి స్పందించిన రేణు దేశాయ్..!!

పవన్ కళ్యాణ్ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనియా ఏర్పరిచారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ సతీమణి అయిన రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఈమె ఆయనతో కలిసి కెరియర్ మొదటిలో ఎన్నో సినిమాలలో నటించింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని రోజులు సహజీవనం కూడా చేసింది.ఇక ఈ నేపథ్యంలో నే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఇప్పటికి పలు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.Pawan Kalyan was never like a husband with me, says Renu Desai [throwback] - IBTimes India

ఇక మొదటి భార్య నందిని ఉండగానే రేణు దేశాయ్ తో సహజీవనం చేసి అఖీరానందన్ కు జన్మనిచ్చాడు పవన్ కళ్యాణ్ . నందినీకి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు ఇక తరువాత రేణు దేశాయికి కూడా విడాకులు ఇచ్చి రష్యా యువతి అయిన అన్నాలేజినోవా ను వివాహం చేసుకున్నారు. అయితే తమ విడాకులపై ఎప్పుడూ కూడా నోరు విప్పలేదు. రేణూ దేశాయ్ కానీ ఎట్టకేలకు ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను తెలియజేసింది. ముందుగా పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చి విడాకులు అడిగారని తెలియజేసింది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అప్పుడే యాక్టివ్ గా ఉండడం చేత.. పవన్ కళ్యాణ్ పరువుకు భంగం కలగకూడదని ఆమె విడాకులకు అంగీకరించానని తెలియజేసింది.Pawan Kalyan | Badri Movie: Renu Desai recalls 'Chikitha' moment with Pawan Kalyan as Badri completes 21 Years

ఆ సమయంలో తన పిల్లలు అకీరా, ఆధ్యా చాలా చిన్నవారని వారిని తానే పెంచుతున్నానని తెలియజేసింది. కానీ విడాకుల తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యాయని దాంతో ఇద్దరు పిల్లలను ఒక తల్లిగా పెంచడం చాలా కష్టమైందని తెలిపింది. అయితే రేణూ దేశాయ్ మాట్లాడిన ఈ మాటలు చాలా సంవత్సరాల క్రితమే అయినా కానీ ఇప్పుడు ఇది చాలా వైరల్ గా మారుతోంది. ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండడం చూసిన కొంతమంది ఓర్వలేక ఇలా పాత వీడియోలను షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

https://www.facebook.com/watch/?v=609679650471067

Share post:

Latest