ఆయన సూపర్ ఎమ్మెల్యేగా వైసీపీలో గుర్తింపు పొందారు. చేతికి ఎముకలేని నాయకుడిగా నియోజకవర్గం లోనూ పేరు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థి తి డోలాయమానంలో పడిపోయింది. అసలు టికెట్ దక్కించుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారిపో యింది. ఆయనే అన్నా రాంబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి సీఎం జగన్ తర్వాత.. అంత భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.
అందుకే ఆయనకు వైసీపీలో సూపర్ ఎమ్మెల్యే అనే పేరు వచ్చింది. అయితే.. ఎంత పేరున్నా.. ఆయన నోటి దురద కారణంగా..పార్టీకి.. నాయకులకు కూడా దూరమయ్యారు. పోనీ.. ఇలా జరిగినా.. ప్రజల్లో బలం ఉంటే.. గెలుపు గుర్రం ఎక్కేయొచ్చు. కానీ, అలా కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ప్రజలకు ఆయన దూరంగా ఉంటున్నారు. `ఏం తిరుగుతామయా.. ఆయన చెప్పాడు..చెబుతాడు.. కానీ.. ఇక్కడ జనాలు వాయించేస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు.
గడపగడప కార్యక్రమంలో అన్నా రాంబాబు పట్టుమని.. పది ఇళ్లు కూడా తిరిగిన పాపాన పోలేదు. తనను తాము మంత్రిగా భావించుకునే.. ఆయన.. అధికారులను తన గ్రిప్‌లో ఉంచుకోవాలని చూస్తున్నారనే వాదన ఉంది. అయితే.. సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి… మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో అధికారులు వారి మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అన్నా.. ఇంటి గడప కూడా దాటడం లేదు.
మొన్నామధ్య తనకు మంత్రి పదవి రాలేదని.. కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి నుంచి బలమైన వార్నింగే వచ్చిందట. పార్టీలో ఉంటే ఉండండి.. లేకపోతే.. ఫర్వాలేదు. అని చెప్పేశారట. దీనికితోడు.. రెడ్డి సామాజిక వర్గం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసింది. నియోజకవర్గంలో కనీసం వార్డు మెంబరు కూడా ఎమ్మెల్యేను ఖాతరు చేయడం లేదు. ఏదైనా పని ఉంటే.. బాలినేని వద్దకే వెళ్తున్నారట., దీంతో వచ్చే ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసిన తన గెలుపు కష్టమేనని.. అన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. వైసీపీలోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.