3 Days Collections”పక్కా “కమర్షియల్ కలెక్షన్స్”..గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!!

కామెడీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో..మ్యాచో హీరో గోపీచంద్ , అందాల తార రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రమే..”పక్కా కమర్షియల్”..అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. భారీ అంచనాల నడుమ జులై 1న విడుదలైన ఈ పక్కా కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్ గా నిలిచింది.

రివ్యూస్ ఎలా ఉన్నా.. సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నా కానీ..ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం..అదరకొట్టేసింది . అఫ్ కోర్స్ , మిగత సినిమాల హీరోలతో పోల్చితే ఇది తక్కువే అయినా.. గోపీచంద్ ప్రజెంట్ స్దాయికి, రేజ్ కి ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువ అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా లో గోపీచంద్ యాక్షన్..రాశీ ఖన్నా అందాలు..మారుతి కామెడీ టైమింగ్..మూడు సినిమాకి ప్లస్ గా నిలిచాయి.

ఈ సినిమాలో మారుతి కామెడీ ట్రాక్ కొంచెం తప్పినా..సినిమాను బోర్ కొట్టించకుండా..అలా నవ్వులతో లాకుని రావడంతో..జనాలు ఈ సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీంతో సినిమా భారీ కలెక్షన్స్ అందుకుంటుంది. ఫస్ట్ డే నే టోటల్ గా రు. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి..గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీకెండ్ ముగించుని.. మూడు రోజులు కంప్లీట్ చేసుకుని..పక్కా కమర్షియల్ హిట్ గా నిలిచింది. శనివారం ఈ సినిమా రు 10.5 కోట్లు సాధించగా , ఆది వారం వచ్చే సరికి రు. 15.2 కోట్లు క‌లెక్ట్ చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది.

పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా..
* Nizam రూ. 1.73 కోట్లు,
* సీడెడ్ (రాయలసీమ) రూ. 86 లక్షలు
* ఉత్తరాంధ్ర రూ. 86 లక్షలు,
* ఈస్ట్ రూ. 50 లక్షలు,
* వెస్ట్ రూ. 40 లక్షలు,
* కృష్ణ రూ. 41 లక్షలు

ఇక ఏపీ మొత్తం 5.49 కోట్ల షేర్..రూ. 9.5 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 కోట్లు, ఓవర్సీస్ 0.72 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 6.4 కోట్ల షేర్‌ను రూ. 11 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి.