సమంత ఢబుల్ మీనింగ్ పోస్ట్ ..నాగచైతన్య కౌంటర్ అద్దిరిపోలే..?

అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య..తన తాత, నాన్న పేర్లు చెప్పుకుని ..వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ వాడుకుని కొన్ని సినిమాలు చేసినా..ఆ తరువాత మెల్ల మెల్లగా ఆయన కంటూ ఓ సపరేటు ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు . ఇప్పుడు ఇండస్ట్రీలో నాగ చైతన్య కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రజెంట్ నాగచైతన్య తన లక్కి డైరెక్టర్ మనం సినిమా తెరకెక్కించిన విక్రమ్ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ సినిమా లో హీరో గా నటించాడు. నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా..మెయిన్ హీరోయిన్ గా మాత్రం రాశీ ఖన్నా నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ టైంలో అమ్మడు నాగ చైతన్య తో బాగా క్లోజ్ దిగిన ఫోటోలో ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయి.

కాగా, ఈ సినిమా జూలై 22న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ టై దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ని చకచకా మొదలు పెట్టారు టీం మెంబర్స్. ఈ క్రమంలోనే నాగ చైతన్య, రాశి ఖన్నా ఓ ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొని..సరదా ఆన్సర్స్ ఇచ్చి జనాలను ఎంటర్ టైన్ చేశారు. యాంకర్ ఏమి అడిగినా కేవలం 5 సెకండ్లలోనే సమాధానం ఇవ్వాలి.. అంటూ ఓ కండీషన్ పెట్టింది.

అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయారు కానీ..కొన్ని ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి..కాసేపు నవ్వుకున్నారు. కాగా, యాంకర్ ..5 సెకండ్లలో మూడు డబుల్ మీనింగ్ మాటలు చెప్పండి అంటూ నాగచైతన్య ను అడిగ్గింది. చైతు టక్కున అందుకుని..మాట్లాడుతూ.. “నేను ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలను మాట్లాడను..నాది ఏదైన స్టైట్ గా ఉంటుంది. అన్ని ముఖానే అడిగేస్తా..”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కొందరు సమంత కే ఈ పంచ్..ఆమె అక్కినేని ఫ్యామిలీ పై చేసే డబుల్ మీనింగ్ పోస్ట్లకే ఈ ఘాటు కౌంటర్ అంటూ సామ్ ను ట్రోల్ చేస్తున్నారు.