చంద్రమోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఈ నటుడు. కానీ ప్రస్తుతం పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు . గతంలో ఒకవైపు హీరోగా, కమెడియన్ గా, విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. దాదాపుగా 900 వందలకు పైగా చిత్రాలలో నటించారు చంద్రమోహన్. అందులో 135 సినిమాలలో హీరోగా నటించారు. ఇక ఈయన సరసన నటించిన ఎంతోమంది హీరోయిన్ల కి సైతం స్టార్ పొజిషన్ వస్తుందనే సెంటిమెంట్ అప్పట్లో బాగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఈయన సరసన జయప్రద, శ్రీదేవి, జయసుధ తదితర హీరోయిన్ల సైతం స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి.
అయితే చంద్రమోహన్ తన సపోర్టుతో తమ పిల్లలను కూడా స్టార్లు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చంద్రమోహన్ తమ ఫ్యామిలీని సినిమాలకి దూరంగా ఉంచాలని ఆలోచనలోనే ఉన్నారట. తమ ఇద్దరూ కుమార్తెలు కూడా బాగుంటారని ఒకానొక సమయంలో భానుమతి గారే చెప్పారని, అందుకోసం చైల్డ్ ఆర్టిస్టుగా తమ పిల్లలతో ఎంట్రీ ఇద్దామని చంద్రమోహన్ ని అడగగా అందుకు చంద్రమోహన్ వద్దని చెప్పారట. అందుకు కారణం ఏమిటంటే నటుడుగా బిజీగా ఉన్న సమయంలో తమ కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని తనకు లేకుండా అయ్యిందని , తన పిల్లలు కూడా ఎప్పుడైనా లొకేషన్ కు వచ్చినా వాళ్ళు తనని గుర్తుపట్టే వాళ్ళు కాదట.తన కుటుంబ సభ్యులకు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం తనకు నచ్చలేదని అందుచేతనే వాళ్ళని సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా పెంచానని తెలిపారు. అంతేకాకుండా ఆమె కుమార్తెలు కూడా చదువులో బాగా రాణిస్తూ గోల్డ్ మెడల్ అందుకుంటున్నారని.
. మంచి ఉద్యోగాలు కూడా సాధించారు అని తెలిపారు. ఇక చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రమే కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన సప్తపది చిత్రంలో నటించినది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. చంద్రమోహన్ తమ్ముడికి కూతురు పేరు సబితా. ఈమె సినిమాలలో నటించిన తర్వాత పలు అవకాశాలు వచ్చాయట. కానీ వాటిని తిరస్కరించి ఆ తర్వాత వివాహం చేసుకున్నది.