వామ్మో.. కొత్త కాపురం కోసం నయనతార ఖర్చు అన్ని కోట్లా.. అన్నింటికన్నా స్పెషల్ అదే..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. పెళ్లికి ముందు ఎఫైర్స్ తో హెడ్ లైన్స్ లో కనిపించినా..ఇప్పుడు మాత్రం భర్త విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని..పద్ధతైన ఇల్లాలుగా కనిపిస్తుంది. నయన్ తో ప్రేమ ఎలా ఉన్నా.. పెళ్లి ఫిక్స్ అని తెలియగానే నయన్ లో చాలా మార్పులు వచ్చాయి.

ఎంత బిజీ గా ఉన్నా..ఖాళీ సమయంలో గుడులు సందర్శించడం.. టూర్లకు వెళ్ళడం..దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ..అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. కాగా, జూన్ 9 న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట..ఆ తరువాత హనీమూన్ ఎంజాయ్ చేసి..ప్రజెంట్ ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు.

అయితే, కోలీవుడ్ మీడియాలో నయన్-విగ్నేశ్ శివన్ లకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఆల్ రెడీ భర్త కోసం ముందే ఓ ఇళ్లు కొనుకోన్ని ఉన్న నయన్..ఇప్పుడు భర్త అభిరుచులకు తగ్గట్లు మరో కొత్త ఇంటిని కొన్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇల్లు విగ్నెశ్ శివన్ పేరు పైనే కొన్నారట. చెన్నైలోనే కాస్ట్లి ఏరియా అయినా పోయెస్గార్డెన్లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

మొత్తం 8 వేల చదరపు అడుగుల స్థలంలో ఆమె ఇప్పుడు తన భర్త టేస్ట్ లకు తగ్గట్లు బంగ్లాను మార్చుకుంటుందట. ప్రత్యేక డిజైనర్స్ తో ఇల్లు రీ మోడల్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసమే ఆమె దాదాపు 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్ బయటకు వచ్చింది. ముఖ్యంగా నయన్ తన కోసం ఓ ప్రత్యేకమైన జిమ్ ను ఇక్కడ డిజన్ చేయించుకుంటుందట. కేవలం ఇంటీరియర్ డిజైన్ కోసమే 25 కోట్లా అంటూ బడా ప్రముఖులు సైతంముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పనులు త్వరగా ముగించి కొత్త కాపురం స్టార్ట్ చేయాలని నయనతార, విగ్నేష్ భావిస్తున్నారట.

Share post:

Latest