ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..?

పెళ్లి అనే విషయానికి వస్తే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి.. టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వివాహం చేసుకోక పోవడం గమనార్హం. ఇకపోతే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎప్పటికప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక కొంత కాలంగా మనం ఎన్నో వార్తలు చదివి వదిలేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణం రాజు కూడా అందరిపై విసుగెత్తిపోయిన విషయంకూడా అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ ఎందుకు వివాహం చేసుకోవడం లేదు.. ఆ సంగతి ఏమిటి అనే విషయాన్ని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెద్దమ్మ కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నోసార్లు ఎన్నో విషయాలను వెల్లడించింది

కానీ ప్రభాస్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఆయన తన వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు 45 సంవత్సరాల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోకపోవడంతో ప్రతి ఒక్కరూ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలలో వధువు దొరికింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే కొన్ని మీడియా లో అయితే అమ్మాయి ఎలా వుంటుంది.. మొగల్తూర్ మహారాణిలా ఉంటుందా.. అంటూ ఇలా కొన్ని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా రోజురోజుకు వైరల్ గా మారుతున్న విషయాలపై కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సంవత్సరం కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని ఎంతో కాన్ఫిడెంట్ గా తెలిపారు. ఇక ఇదే మాటను ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా బల్లగుద్ది మరీ చెప్పడంతో ప్రతి ఒక్కరు కన్ఫామ్ అవుతున్నారు. గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన అభిమానం సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని రివీల్ చేయడంతో ప్రతిచోట ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణం రాజు.. మరొకవైపు అభిమాన సంఘం ప్రెసిడెంట్ కూడా చెప్పడంతో త్వరలోనే డార్లింగ్ పెళ్లి నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular