కొరటాల కంత్రి ప్లాన్..కోపంగా ఉన్న తారక్.. భళే దెబ్బెశాడే..?

వాట్..NTR స్టార్ డైరెక్టర్ కొరటాల పై కోపంగా ఉన్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..NTR తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ తో కమిట్ అయ్యాడని. రీసెంట్ గా NTR బర్తడే సంధర్భంగా..సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు కొరటాల. తాజా లుక్ ని బట్టి…సినిమా మాస్ ఎంటర్ టైనర్ అని అర్ధమౌవుతుంది. అయితే, ఈ కధను ముందుగా అల్లు అర్జున్ కి చెప్పారని..ఆయన తో కొన్ని సీన్స్ షూట్ చేశాక సినిమా ని స్టాప్ చేశారని..ఇప్పుడు అదే కధతో తారక్ తో తీసుతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది.

- Advertisement -

మొదలే ఆచార్య ఫ్లాప్ తో దిగాలుగా ఉన్న కొరటాల..NTR తో సినిమా అయిన హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో ఇలాంటి వార్తలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే, ఇప్పటికే కధ విన్న తారక్ ఆచార్య ఫ్లాప్ తో స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజస్ చేయమని సజీషన్స్ ఇచ్చారట. కానీ, కొరటాల అవి పట్టించుకోకుండా..లైట్ తీసుకున్నారట. అంతేకాదు, సినిమాలో హీరోయిన్ విషయంలో ను తారక్ చెప్పిన మాటలకి..కొరటాల అడ్డు చెప్పుతున్నారట. దానికి తోడు ఇంత వరకు కొరటాల సినిమాలో హీరోయిన్ ని ఫైనల్ చేయకపోవడం కూడా తారక్ కు కోపం తెప్పిస్తుంది.

అయితే, తారక్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి…మళ్ళీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అని భావిస్తున్నాడు. అసలే RRR కారణం గా నాలుగేళ్ళు ఖర్చు అయి పోయాయి..ఇప్పుడైన ఫాస్ట్ గా సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకుంటుంటే..కొరటాల ఏమో ఇంకా ఆచార్య ఫ్లాప్ మూడ్ లోనే ఉన్నాడట. అస్సలు ఇప్పటివరకు వీళ్ల సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో కూడా క్లారిటీ లేదు..కొరటాలని అడిగితే ..నో ఆన్సర్..దీంతో తారక్ కొరటాల శివ పై కోపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ NTR సినిమా పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Share post:

Popular