RRR ‘గే’ సినిమా.. అభిమానులను మండిస్తున్న RGV ట్వీట్..!!

వాట్..RRR “గే” సినిమా నా..మైండ్ దొబ్బిందా RGV కి అని చరణ్,తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బూతులు తిడుతున్నారు. మనకు తెలిసిందే..ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది RRR. దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ళకు పైగా కష్టపడి..సినిమా కోసం రాత్రి పగలు నిద్రలేకుండా శ్రమించి..ఎందరో టెక్నీషీయన్స్ ని..నటులని ఇబ్బందులు పెట్టి..ఆయన పడుతూ..తెరకెక్కించిన సినిమా నే ఈ RRR…రణం రౌద్రం రుధిరం. ఇద్దరు టాప్ హీరో లను పెట్టి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు రాజమౌళి. ఆయన కష్టం ఊరికే పోలేదు..అభిమానులు ఈ సినిమాను టాప్ ప్లేస్ లో నిల్చోపెట్టారు.

కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ని ఎంతో జాగ్రత్తగా..క్లీయర్ గా చూయించాడు రాజమౌళి. 1920 నాటి కల్పిత కథను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా చూసి క్లాస్, మాస్ ఆడియన్స్ అందరు ఫిదా అయిపోయారు. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ..గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కనిపిస్తే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించి అభిమానులను తన నటనతో మెప్పించారు. రూ.1200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సరికొత్త రికార్డ్ సాధించింది. అయితే, మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది..పొగిడే వాళ్లు ఉన్న చోటనే తిట్టే వాళ్లు ఉన్నారు.

అలాగే, ఈ సినిమా పై కొందరు హాలివుడ్ వాళ్లు నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. మనకన్నా సినిమా బాగా తీశారు అని కుళ్లు వల్ల కావచ్చు..లేక కావాలనే సినిమా పై నెగిటివ్ టాక్ తీసుకురావలనే ఉద్దేశంతోనో తెలియదు కానీ..ఈ సినిమాను గే సినిమాగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే, కాంట్రవర్సీల రాజు ..RGV దీని పై స్పందిస్తూ..అభిమానులకు ఇంకా మండిపోయేలా ట్వీట్ చేశాడు. నా ఉద్దేశం కరెక్టే.. ఇది ‘గే’ స్టోరీ అని వెస్ట్రన్ ప్రేక్షకులు చెప్పడంలో నిజముంది” అని రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ఆయన పై ఫైర్ అవుతూ..”వాళ్ళంటే హాలీవుడ్ జనాలు,,మాన సినిమా పై బురద చల్లడానికి చూస్తున్నారు..నీ బుద్ధి ఏమైంది..మొన్నటి వరకు సినిమాని పొగిడేశావ్ గా..ఇప్పుడు గే అంటూ కామెంట్స్ చేయడం ఏంటి”..అంటూ తిట్టిపోస్తున్నారు. కొందరు అయితే, మరి దారుణంగా నువ్వు గే కాబట్టి..నీకు అలానే కనిపిస్తుందిలే అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా హాలీవుడ్ పెట్టిన పెట్టిన RRR చిచ్చు..పెద్ద దుమారం రేపుతుంది.