పక్కలోకి వచ్చినా నువ్వు హీరోయిన్ కాలేవు… తెలుగమ్మాయి క‌ష్టాలు…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ గా రావాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కు తప్పనిసరిగా గురికావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలాంటి బాధలను ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. మరి కొంతమంది తమ తెలివి ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు. రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే పడుకోక తప్పదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇకపోతే ఒక తెలుగు హీరోయిన్ ను పడుకున్నా కూడా నువ్వు హీరోయిన్ ని కాలేవు అంటూ తెగ అవమానపరిచారట. ఇక ఆ తెలుగు హీరోయిన్ ఎవరు.. ఇప్పుడు ఏం చేస్తోంది.. అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్లలో రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ఇక తాజాగా నటిస్తున్న చిత్రం దామిని విల్లా. తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రేఖ పలు విషయాలను వెల్లడించింది.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో ఆమె వెల్లడించింది. నటనపై ఆసక్తి ఉన్న రేఖ సినీ ఇండస్ట్రీ లోకి రావాలనే కోరికతో డిగ్రీ చదువుతున్న సమయంలోనే పలురకాల షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి ఇమేజ్ ను సంపాదించుకుని హీరోయిన్ గా సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు వెల్లడించింది.
ఇకపోతే సుమారుగా 50 సినిమాలకు పైగా ఆడిషన్స్ లో పాల్గొన్న ఈమె కొంతమంది నువ్వు నయనతారలా ఉన్నావ్ అంటారే కానీ ఏ ఒక్కరు కూడా అవకాశం ఇచ్చింది లేద‌ని వాపోయింది.

ఇక మరికొంతమంది నువ్వు పక్కలో పడుకున్నా సరే హీరోయిన్ అయితే అవ్వ లేవు.. సైడ్ ఆర్టిస్టుగా ప్రయత్నం చేసుకో అంటూ మొహం మీదే చాలా దారుణంగా మాట్లాడారు అని ఈ సందర్భంగా రేఖ వెల్లడించింది. ఇకపోతే ఇండస్ట్రీలో చాలా మంది దర్శక నిర్మాతలకు, హీరోలకు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు అని కూడా ఆమె చెప్పింది.

Share post:

Popular