కళ్లు నెత్తికెక్కాయా.. మెగాఫ్యాన్స్ కు మండించిన బాలీవుడ్ హీరో..?

యస్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై గుర్రుగా ఉన్నారు. అంతేనా, సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆయన మెగాస్టార్ వారసుడు..చిరంజీవి కొడుకు చరణ్ పై చేసిన కమెంట్స్ నే. చరణ్ ని అక్షయ్ కుమార్ అన్న అని పిలవడమే ఇంత రచ్చకు కారణమైంది.

వయసులో అక్షయ్ కుమార్ ..రామ్ చరణ్ కన్నా ఎక్కువ పెద్ద వాడు అని మనందరికి తెలిసిందే. ఈ విషయం ఆయనకి తెలుసు కానీ, అలా అన్నా అని ఎందుకు పిలిచాడో అర్ధంకావడం లేదు. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూసిన జనాలు కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా బాగుంది అంటూ పాజిటీవ్ కామెంట్స్ ఇచ్చారు.

ఆ ట్రైలర్ పై రామ్ చరణ్ కూడా మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక ఆ ట్వీట్ ని కోట్ చేస్తూ చరణ్ కి అక్షయ్ కుమార్ థాంక్స్ చెప్పాడు. యాక్టింగ్ బాగుంది అంటూ పొగిడేశారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ట్వీట్ లో రామ్ చరణ్ ని అన్న అంటూ సంభోదించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కి మండిపోయింది. బుద్ది ఉందా..కళ్ళు నెత్తికెక్కాయా..ఎవరు ఎవరికి అన్న .. నీ వయసు ఎంత నీకు చరణ్ అన్న నా ? అంటూ అక్షయ్ కి తన వయసు గుర్తుచేస్తూ దారుణంగా కామెంట్స్ తో ఆడుకుంటున్నారు.

- Advertisement -

Share post:

Popular