ఆ దర్శకుడివల్లే ఈ హీరోయిన్ల జీవితం నాశనం అయ్యిందా..?

సినీ పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. ఇక్కడ క్లిక్ అయినవారు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదే ఫెయిల్ అయినవాళ్లు తమ అయినవారికి కూడా కాకుండా పోతారు. ఇలాంటి దారుణాలను ఎన్నింటినో అక్కడ చూడవచ్చు. ఎంతోమంది ఆడవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఎవరన్నా కొత్తవారు సినిమా పరిశ్రమకు వస్తామంటే మందలిస్తారు.

ఆ దర్శకుడు ఇతడేనా ?
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు అనుకోకుండా కొంత మంది డైరెక్టర్లు దురదృష్టంగా మారుతూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది డైరెక్టర్ ల వల్ల ఇండస్ట్రీకి దూరమైన నటీమణులు గురించి ఇక్కడ చర్చించుకుందాం. ఇప్పుడు చెప్పబోయే కొంత మంది హీరోయిన్ల కెరీర్ నాశనం అవ్వడానికి కారణం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని గుసగుసలు వినబడుతున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా, సమంతా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అ ఆ. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్. అయితే ప్రస్తుతం ఈమె కెరీర్ మాత్రం అంతంతమాత్రంగానే సాగుతోంది అని చెప్పవచ్చు.

ఇది నిజమేనా ?
2005లో వెన్నెల చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన పార్వతి మీనన్ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జల్సా సినిమాలో నటించిన తరువాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించిన తరువాత పూజ హెగ్డే చేసిన సినిమాలు వరుసగా అటకెక్కుతున్నాయి. దాంతో అమ్మడుకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఇక చివరగా స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆర్తి అగర్వాల్ త్రివిక్రమ్ డైరెక్షన్లో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ చివరికి అకాల మరణం పొందింది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాక నిజమేకదా అని అనిపించక మానదు. కానీ ఇలాంటి తప్పుడు ఇమేజినేషన్ చేయకండి ఫ్రెండ్స్. కర్మ అనేది ఒకటుంటుంది