పూజా కొత్త కండీషన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..చూసేందుకు రవ్వంత ఉంటుంది..కానీ, లోపల టాలెంట్ బోలెడు. హీరోయిన్ గా అవాలాని మోడలింగ్ చేస్తూ..ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ..కెరీర్ మొదట్లో చాలా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మంచి మంచి అవకాశాలు వచ్చినా..తెలిసి తెలియని అమాయకత్వంతో..రాంగ్ స్టోరీలు చూస్ చేసుకుని..కధలో ఇంపార్టెన్స్ లేని రోల్ సెలక్ట్ చేసుకుని ..కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు వేసుకుంది.

ఇక ఆ తరువాత ఎలాగోలా హిట్ కొట్టిన అమ్మడు..అప్పటి నుండి వరుస సినిమాలకు సైన్ చేస్తూ..కెరీర్ లో బిజీ గా మారిపోయింది. ఇప్పుడు అమ్మడు తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లోను సినిమాలు చేస్తూ..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉంది. అంతేనా సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తూ..నిర్మాతలకు చుక్కలు చూయిస్తుంది. అయినా కానీ, జనాల్లో ఆమెకు ఉండే క్రేజ్ బట్టి..పూజా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు..నిర్మాతలు.

ఇవి చాలవు అన్నట్లు ఇప్పుడు పూజా మరి కొన్ని కొత్త కండీషన్స్ తో దర్శకనిర్మాతలకు చమటలు పట్టిస్తుందట. వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి పూజాకి భయం మొదలైన్నట్లుంది..అందుకే..సినిమాకి మాట్లాడుకున్న అమౌంట్ 60% అడ్వాన్స్ గా ముందే చెల్లించాలని కొత్త రూల్ పెట్టిందట. జనరల్ గా సినిమా కమిట్ అయ్యాక 30% ఆ తరువాత షూటింగ్ సగం కంప్లీట్ అయ్యాక 40%..ఫైనల్ స్జెడ్యూల్ లో మిగత 30% క్లీయర్ చేస్తారట నిర్మాతలు. కానీ, పూజా ఇప్పుడు ఒక్కేసారి సగంకి పైగా అమౌంట్ అడ్వాన్స్ గా ఇవ్వాలని అప్పుడే సినిమాకి సైన్ చేస్తాను అంటూ కండీషన్ పెట్టేసరికి దర్శకనిర్మాతలకు కొత్త సమస్యలు ఎదురైయాయి. మరి చూడాలి పూజా విషయంలో డైరెక్టర్లు ఏం చేస్తారో..?

Share post:

Popular