అసలైన మగాడు అంటే..ఆ మూడు వదిలేయాలి..!!

RGV..ఈ పేరు చెప్పితే బయపడే వాళ్లు ఉన్నారో లేరో తెలియరు కానీ..తిట్టుకునే వాళ్ళు మాత్రం బోలెడు మంది ఉన్నారు. కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయడంలో ఆయన తరువాతే ఎవ్వరైనా. అడిగినా అడగకున్నా..ఆయన అభిప్రాయం చెప్పే నిర్మోహమాటంగా చెప్పే సతా ఉన్న వ్యక్తి..ఈ రామ్ గోపాల్ వర్మ. లైఫ్ ఇలా కూడా ఎంజాయ్ చేస్తారా..? అంటున్నారు నేటి యువత ఆయన అమ్మాయిలతో మెదిలే తీరు చూస్తుంటే. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి బాగా పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు.. శృతిమించిన మాటలతో..హద్దులు దాటిన ప్రవర్తనతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

రీసెంట్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా..’మా ఇష్టం’. ఫుల్ హాట్ సీన్స్ తో..శృతి మించిన రొమాన్స్ తో..హద్దులు చెరిపేస్తూ..ఇద్దరు అమ్మాయిలను హైలెట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా గా ట్రైలర్ బట్టి తెలుస్తుంది. దీని పై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాలో పచ్చి బూతులు చూయిస్తూ సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ ..అని ఫైర్ అవుతున్నారు. ఎవ్వరు ఎన్ని అనుకున్నా..ఏం అనుకున్నా నా రూట్ నాదే..అంటూ రామ్ గోపాల్ వర్మ తన పని చేసుకుపోతున్నాడు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..ఓ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో హీరోయిన్స్.. నైనా గంగూలీ, అప్సరా రాణి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెశారు. సినిమా లో మీరు నిజాలు చూస్తారని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..ఎవ్వరైనా తనలా ఈ సమాజంలో బతకాలనుకుంటే ఖచ్చితంగా మూడూ విషయాలను వదిలేయాలి అంటూ చెప్పుకొచ్చారు. ” దైవం, సమాజం, ఫ్యామిలీ” ఈ మూడింటిని వదిలేస్తే.. తనలా బ్రతకచ్చు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో RGV పై మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేసారు ట్రోలర్స్. నువ్వు అసలైన మగాడివి సామీ..అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. నీలా మమ్మల్ని కూడా చెడిపోమంటావా ఏంటి..అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో RGV కామెంట్స్ నెట్టీంట తెగ వైరల్ గా మారాయి.