అది ఎక్స్పెక్ట్ చేస్తున్న సమంత..బాలీవుడ్ అర్ధం చేసుకోవట్లేదే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు. నచ్చింది నచ్చిన్నట్లు మొహమాటమే లేకుండా..చేయడం అంటే సమంతకు ఇష్టం. అందుకే కాబోలు విడాకులు తీసుకున్న తరువాత ఏ మాత్రం బాధపడకుండా..భయపడకుండా..తన కెరీర్ పై ఫోకస్ చేస్తూ,, నెట్టింట ట్రోల్స్ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజెంట్ సమంత నటించిన సినిమాలు శాకుంతలం, యశోద రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగులో రెండు బడా ఆఫర్లను హోల్డ్ లో పెట్టుకుని ఉంది సమంత.

ఇక ఈ మధ్యనే శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో కలిసి..ఖుషీ అనే సినిమా చేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. ఖుషీ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. అయితే, సినీ వర్గాలల్లో సమంత బాలీవుడ్ ఎంట్రీ పై తీవ్రంగా చర్చ నడుస్తుంది. నిజానీకి ఆమెకు బాలీవుడ్ నుండి బడా బడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ సమంత ఎందుకో స్టోరీ విని వాటిని రిజెక్ట్ చేస్తుంది అంటున్నారు ప్రముఖులు.

కాగా, సమంత ఎందుకు ఇలా బాలీవుడ్ సినిమాలకు సైన్ చేయడం లేదంటూ ఆరా తీయ్యగా..షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. సమంత లైఫ్ నే తలకిందులు చేసిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఆ సిరీస్ లో సమ్మత నటన అధుబుతం ..అలాంటి పాత్ర చేయడానికి ధైర్యం ఉండాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే , ప్రజెంట్ సమంత బాలీవుడ్ లో ఎంట్రీ అలాంటి పవర్ ఫుల్ రాజీ పాత్ర లా ఇవ్వాలి అనుకుంటుందట. దానికోసం ముద్దు సీన్లు, బెడ్ సీన్లకి కూడా రెడీ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ నుండి ఏమో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు ఇస్తున్నారట. దీంతో సమంత డిసప్పాయింట్ అయ్యి..వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి సమంత ఎక్స్ పెక్ట్ చేసిన కధ ఎవరు తెస్తారో చూడాలి..?

Share post:

Popular