ఫ్యాన్స్ కొట్టుకోవ‌డం ఆపండి… టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో ఎవ‌రో తెలిసిపోయింది…!

ఇపుడు తెలుగు సినిమాలు, హీరోల హవా నడుస్తోంది. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక ఏది ఎలా వున్నా ఇక్కడి హీరోలు మాత్రం ‘మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప’ అంటూ గప్పాలు కొట్టుకుంటూ బతకడం షరా మామ్మూలే. అదే ఇప్పుడు తేలిపోయింది. వారు కొట్టుకువడం కాదు, మనం ఈ విషయం తేల్చదామని ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ‘ఆర్మాక్స్ మీడియా’ తాజాగా ఓ సర్వే చేసింది. సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేసింది.

తాజాగా మార్చి 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ జాబితాలో ప్రభాస్ 1st స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. అలాగే కొందరు హీరోల స్థానాలు కాస్త అటుఇటు మారడం కొసమెరుపు. ఇక ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే, తెలుగు స్టార్స్ కేటగిరీలో ఓ ఏడాది పాటు ఏక చక్రాధిపత్యం కొనసాగించిన మహేష్ బాబుని కాదని మొదటి స్థానాన్ని జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను అల్లు అర్జున్ వశం కైవసం చేసుకోగా ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రభాస్ ఆక్రమించాడు.

ఫిబ్రవరిలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈ నెలలో మొదటి స్థానానికి ఎగబాకడం విశేషం. ఇక జనవరి ఫిబ్రవరి నెలలో మొదటి స్థానం తెచ్చుకున్న అల్లు అర్జున్ తాజాగా 2వ స్థానానికి చేరాడు. అలాగే ఫిబ్రవరి నెలలో 5వ స్థానానికి పరిమితమైన NTR ఏకంగా ఇపుడు 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ నాలుగో స్థానం నుండి ఐదో స్థానానికి దిగజారారు. ఇక రామ్ చరణ్ తన స్థానాన్ని 6వ నెంబర్ తో సరిపెట్టుకున్నాడు. 7వ స్థానంలో ఉన్న నేచురల్ స్టార్ నాని, 8వ స్థానంలో విజయ్ దేవరకొండ తమ ఉనికిని చాటుకున్నారు.

అలాగే తెలుగు ఇండస్ట్రీకి కుడి భుజం లాంటివారు అయినటివంటి మన మెగాస్టార్ చిరంజీవి 9 నెంబర్ ని చేరుకున్నారు. ఇక ఈ జాబితాలో రవితేజ 10వ స్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవి, ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.