టాలీవుడ్ లో ఎందరో తమ సొంత కృషితో ఎదిగిన నటీ నటులు ఉన్నారు. అటువంటి అతి తక్కువ నటులలో ఒకరే స్వర్గీయ ఉదయ్ కిరణ్. ఇతను మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సరికొత్త ప్రేమ కథలకు నాంది పలికాడు. తేజ డైరెక్టర్ గా చేసిన “చిత్రం” సినిమాతో తన సినిమా కెరీర్ ను ఆరంభించాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత వరుస హిట్ లను సాధించి ఒకానొక దశలో స్టార్ హీరోల రేంజ్ కు ఎదిగిపోయాడు. టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలకు కూడా ఇతనిపై పెట్టుబడి పెడితే నష్టం అయితే రాదు అన్న నమ్మకాన్ని కలిగించుకున్నాడు.
అయితే తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు తమ స్వార్థం కారణంగా ఉదయ్ కిరణ్ కష్టాలు పాలయ్యాడు. వరుస ప్లాపులు ఒకవైపు అయితే ఆర్థిక కష్టాలు మరి వైపు అతనిని చుట్టు ముట్టడంతో ఇక భరించలేని ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడు. అయితే ఇప్పటికీ ఇతని ఆత్మహత్య ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది. అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ మరణానికి కారణం తన భార్య విషిత అని వార్తలు వచ్చాయి. ఈమె బాగా డబ్బుకు అలవాటు పడి ఉదయ్ కిరణ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు అసహ్యించుకోవడం మూలంగానే ఇంతటి ఘోరం జరిగిందని అనుకున్నవారు లేకపోలేదు.
అయితే ఉదయ్ కిరణ్ మరణానంతరం భార్య విషిత ఏమి చేస్తోంది? ఎక్కడ ఉంది? అన్న విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విషిత పెళ్లికి ముందు నుంచే సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా తన జాబ్‌ని కంటిన్యూ చేశారు. అంతే కాదు ఉదయ్ కిరణ్ కి మోరల్గానూ మంచి సపోర్ట్ గా నిలిచింది. ఉదయ కిరణ్ మరణం తరువాత కూడా ఆమె మరో పెళ్లి చేసుకుండా ఉండిపోయింది.
ఎంతో ఇష్టంగా ప్రేమించిన భర్త అర్థంతరంగా దూరం కావడంతో ఒంటరైపోయింది. తనభర్త స్టార్ హీరో అని ఎంతగా మురిసిపోయిందో, అంతకు రేటింపుగా కుంగిపోయింది. అంతగా ఇష్టపడిన భర్త లేనప్పటికీ తన జీవితాన్ని ప్రస్తుతం ఆయనకే అంకితం చేసి ఒంటరిగా తన ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం విషిత ఫేస్బుక్ వంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ, వచ్చిన జీతంతో తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అంతేకాదు తనకి వీలున్నప్పుడల్లా ఉదయ్ కిరణ్ పేరుతో ఎన్టీవో లాంటి మరెన్నో సంస్థలకు విరాళాలు ఇస్తూ, పూర్తిగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతుంది.
ఇంత చిన్న వయసులోనే భర్త చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోకుండా తన భర్త జ్ఞాపకాలతోనే ఉండిపోవటం పలువుర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే అదే సమయంలో తన భర్తపై ఉన్నస్వచ్ఛమైన ప్రేమని కూడా చాటుతున్నారు విషిత. ఈ రోజుల్లో ఇలా ఉండగల వ్యక్తులు చాల అరుదు అని చెప్పుకోవచ్చు .