బంగారంలాంటి సినిమాని వదులుకున్న సాయి పల్లవి..ఈ పిల్ల మారదా..?

సాయి పల్లవి..ఆ పేరు కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు ఓ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చూసేందుకు సన్నగా కరెంట్ తీగలా ఉన్నా..లోపల పవర్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. అందానికి అందం నటనకి నటన ..డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పన్నవసరంలేదు. నెమలి డ్యాన్స్ చేస్తే ఇలానే ఉంటుందా అని అనిపించేలా ఆ నడుము గిరగిర తిప్పుతూ చూపుతిప్పుకోనీకుండా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో పల్లవి లాంటి పాప హీరోయిన్ గా దొరకడం చాలా కష్టం.

చాలా వరకు హీరోయిన్లు డబ్బు కోసం తమకు క్యారెక్టర్ లేకున్న..గ్లామరస్ డోస్ కోసం సినిమాలో హీరోయిన్ గా చేస్తారు. కానీ, సాయి పల్లవి రూటే వేరు. డబ్బు కోసం కాదు..తన ఆనందం కోసం తనలోని టాలెంట్ ని నలుగురికి చూయించడం కోసం సినిమాలు చేస్తుంది. ఎక్స్ పోజింగ్ అంటే ఆమడ దూరం లో ఉంటుంది. అసలు అలాంటి క్యారెక్టర్ ఉన్న స్టోరీలను ఆమె దగ్గరకు తీసుకెళ్లరు డైరెక్టర్లు..ఎందుకంటే నిర్మోహమాటంగా మొహానే నో చెప్పేస్తుంది. అంత ధైర్యం ఉంది ఈ హైబ్రీడ్ పిల్లకి. అమ్మడు స్టోరీల విషయంలో ఎంత స్ట్రీక్ట్ అంటే ..టాలీవుడ్ బడా స్టార్స్ పవన్ కల్యాణ్, చిరంజీవి సినిమాలో అవకాశం వస్తేనే నో చెప్పేసింది. దానికి పక్క క్లారిటీతో ఆన్సర్ కూడా ఇచ్చి అందరిని ఫిదా చేసింది ఈ బ్యూటి.

కాగా, మళ్ళీ మరోసారి బడా సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సాయి పల్లవి టాలీవుడ్ బడా స్టార్ సినిమాను రిజెక్ట్ చేసిందట. సినిమాలో స్టోరీ ఉన్నా..తన పాత్రకు వాల్యూ ఉన్నా కానీ పల్లవి ఈ పాత్ర వదులుకుంది అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దానికి కారణం లేకపోనూ లేదు.. ఈ సినిమాలో హీరోయిన్ ని రేప్ చేసే సీన్ ఉందట..దానికి కూడా ఓకే చెప్పిన సాయి పల్లవి..రౌడీలు ఆమె పై పడి..కొంచెం హార్ష్ గా చూపించే విధంగా సీన్స్ చెప్పారట డైరెక్టర్..దీంతో పల్లవి ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఆ సీన్స్ లో కొంచెం వల్గారిటీగా ఉంటుంది సారీ నేను అలా చేయలేను సార్ అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఈ సినిమా కోసం అమ్మడుకి 2 కోట్లు ఆఫర్ చేసారట మేకర్స్ అయినా కానీ సాయి పల్లవి లొంగలేదు. దీని పై సాయి పల్లవిని కొందరు పొగుడుతుంటే,, మరికొందరు వచ్చినా ఆఫర్స్ అన్ని ఏవో సాకులు చెప్పి రిజెక్ట్ చేస్తే నీకే బొక్క అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ పిల్ల మారదా ఇక..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.