ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమాలని, కోట్లల్లో రెమ్యూనరెసహన్ తీసుకుంటూ జెట్ స్పీడ్ లో సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక 100 కోట్ల క్లబ్ అంటూ వాళ్లకి వాళ్ళే ఓ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా ప్రపంచంలో హీరోల మార్కెట్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలిసిందే. ప్రతి సినిమాకు ఓ విధంగా మారుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి.
ఈ ఐదేళ్ల కాలంలో నే పలువురు టాప్ హీరోలు వాళ్ల మార్కెట్ ను ఒక్కసారిగా వందకోట్లు దాటించేశారు. అలాంటి వారిలో అల్లు అర్జున్, తారక్, చరణ్, మహేష్ బాబు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ సినీ టఫ్ ప్రపంచంలో 100 కోట్ల క్లబ్ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. టాప్ హీరోల సినిమా రిలీజ్ అయితే చాలు ఆ హీరో వంద కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాదు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ కూడా తమ సినిమాల ద్వారా 100 కోట్ల షేర్ ను అందుకున్నారు. మరికొందరు అందుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు టాలీవుడ్ బడా హీరో..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్ లోకి చేరకపోవడం అభిమానులను నిరాశపరిచే విషయం.
నిజానికి ఇప్పటికిప్పుడు ఎవ్వరినైన టాలీవుడ్ నెం 1 హీరో ఎవ్రు అంటే అందరు టక్కున చెప్పే పేరు పవన్ కళ్యాణ్. మరి అలాంటి ఆయన ఇప్పటివరకు 100కోట్ల క్లబ్ కి చేరకపోవడం కొంచెం ఆశ్చర్య కలిగించే విషయమే. రీసెంట్ గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమాతో ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో కి చేరుతాడు పవన్ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. కానీ, సరిగ్గా అదే టైంలో ఏపీ ప్రభుతవం టికెట్లు రెటు తగ్గించడం ..కావాలనే కొందరు పని కట్టుకుని సినిమా పై నెగిటీవ్ ప్రచారం చేయడంతో ..పవన్ 100కోట్ల క్లబ్ ను మిస్ అయ్యాడు. పవన్ భీమ్లా నాయక్ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 90 నుంచి 95 కోట్ల మధ్య లో షేర్ ను వసూలు చేసిన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కవేళ్ళ టికెట్ల గోల లేకుండా ఉంటే ఈ సినిమాతో ఆ అరుదైన రికార్డ్ ని నెలకొల్పేవాడు పవన్. పోనీ, నెక్స్ట్ సినిమాలు ద్వార అయినా ఆ రికార్డ్ బీట్ చేస్తారా అంటే అది లేదేనే అంటున్నారు సినీ విశ్లేషకులు. క్రిష్ డైరెక్షన్ హరి హర వీరమల్లు..హారీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ రెండు కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ సాధించే సీన్ లేదు అంటూ అంచనా వేస్తున్నారు. మరి పవన్ 100కోట్ల క్లబ్ లోకి ఎప్పుడు చేరుతాడో..వేచి చూడాల్సిందే..!!