టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానుల్లో ఓ క్రేజ్..దానికి తగ్గ రేంజ్ ఉంది. ఆయనను ఒక్క మాట అన్న పడతాడు ఏమో కానీ..ఫ్యాన్స్ మాత్రం తాట తీసేస్తారు. ప్రభాస్ అంటే అంత ఇష్టం వాళ్లకి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. నిరంతరం ప్రభాస్ వెంటే ఉంటూ..తన సినిమాలకి సంబంధించిన టీజర్స్,ఫస్ట్ లుక్,ఫస్ట్ సింగిల్,ట్రైలర్ లు రిలీజ్ అయ్యినప్పుడు..ముందు రికార్డులు బద్దలు కొట్టే విధంగా ప్లాన్ చేసుకుంటారు రెబల్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి టాప్ హీరో పోజీషన్ లో ఉన్నాడు.
రీసెంట్ గా రిలీజ్ అయిన రాధే శ్యామ్ అభిమానుల అంచనాలను అందుకోలెకపోయినప్పటికి..ప్రభాస్ నటన ఎక్స్ ప్రేషన్స్ కి ఫ్యాన్స్ మంచి మార్కులే వేశారు. కాగా, ఈసారి ఎలాగైన ప్రభాస్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. దానికోసమే తన నెక్స్ట్ సినిమా సలార్ కి బాగా కష్టపడుతున్నారు. రాధ్యే శ్యామ్ మూవీ నేర్పించిన గుణపాఠం తో ..ఆ సినిమాలో చేసిన తప్పులను ఈ సినిమాలో చేయకుండా..ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాగా, సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు సరికొత్త ఎలిమెంట్స్ ని ఇందులో యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే, ఈ సినిమా ప్రభాస్ కు పోటీగా ఆయన పాత్రకు సరిసమానంగా ఉండేటటువంటి పాత్రల్లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు అని తెలిసిందే. ఆయన ఈ పాత్రకు ఎంపిక చేయడానికి వెనుక పెద్ద కధే నడిచిందట. ఫస్ట్ ఈ సినిమాలో ఆయన రోల్ చెప్పగానే ఓకే చేశాడట పృథ్వీ.. కానీ మధ్యలో కొన్ని సంఘటనల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాలి అనుకున్నాడట..ఆల్ మోస్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకుందాం అని అనుకునే టైంలోనే ..ప్రభాస్ కాల్ చేసి.. ప్రశాంత్ నీల్ తో మాట్లాడి.. తనను ఒప్పించి మళ్లీ ఈ ప్రాజెక్టులో మళ్ళీ భాగమయ్యేలా చేశారని పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పుడు ఇదే ప్రభాస్ అభిమానులకు నచ్చలేదు.. పాన్ ఇండియా హీరో గా ఉన్న నువ్వు ఆయన కోసం ఇంత కన్వీన్స్ చేయనవసరం లేదు..నీ స్దాయి దిగ్జార్చుకున్నావు డార్లింగ్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే..ఆయన అంత తోపా..చేయను అంటే వదిలేయాల్సింది..నువ్వు రిక్వెస్ట్ చేయడం హర్టింగ్ గా ఉంది అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ చివరగా తెలుగులో పోలీస్ పోలీస్ అనే సినిమా చేశాడు. మళ్లీ సలార్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.