మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదే.. చరణ్ మాటలకు ఫ్యాన్స్ షాక్..?

అటు ఇండస్ట్రీలో..ఇటు సోషల్ మీడియాలో కరోనా రాకముందు అంతకముందు నుండి కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్న మ్యాటర్స్..ఒకటి టాలీవుడ్ ఆరు అడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? మరోకటి..టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కొడుకు చరణ్ తండ్రి ఎప్పుడు అవుతాడు..? ఈ రెండింటికి ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ చాలానే వేస్తున్నారు జనాలు. ప్రభాస్ తన పెళ్లి మ్యాటర్ పై నోరు విప్పడు..సో జనాలకు ఇష్టం వచ్చిన్నట్లు ఊహించుకుంటారు.

ఇక చరణ్ విషయానికి వస్తే..ఆయన భార్య ఉపాసన..పలు ఇంటర్వ్యుల్లో చాలా సార్లు ఈ విషయమే క్లారిటీ ఇచ్చింది. మాకు వేరే ప్లానింగ్స్ ఉన్నాయని.. సో పిలలు పుడితే మేము పూర్తి టైం వాళ్లకే కేటాయించాలి అని..ఇప్పుడు అంత టైం మా దగ్గర లేదు…ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఉంటే ఫస్ట్ అభిమానులతోనే షేర్ చేసుకుంటా..ఇది మా పరసనల్ మ్యాటర్..మాకే వదిలేయండి..సోషల్ మీడియాలో రచ్చ చేయకండి అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చింది.

కానీ, చరణ్-ఉపాసన్ కి పిల్లలు పుట్టకపోవడం పై అనేక వద్దంతులు..మీడియాలో వినిపిస్తున్నాయి. కాగా, రీసెంట్ గా RRR సక్సెస్ సంధర్భంగా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న చరణ్ కి ఇదే విషయం పై ప్రశ్నలు ఎదురవ్వగా..ఆయన మాట్లాడుతూ కొన్ని తమ పరసనల్ మ్యాటర్ బయటపెట్టిన్నట్లు తెలుస్తుంది. “ఉపాసన కు నాకు కెరీర్ లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ గోల్స్ రీచ్ అయ్యాకనే పిల్లలు గురించి ఆలోచిస్తాం. అంతవరకు మాకు ఓ ప్లాన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా నేను మెగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలి..అవసరం ఒక్కవేళ ఇప్పుడే నాకు పిల్లలు పుడితే నా కాన్సెంట్రేషన్ డీవియేట్ అవ్వొచ్చు. అందుకే కొన్నాళ్ల పాటు మేము పిల్లల్ని కనకూడదు అని డిసైడ్ అయ్యాం: అంటూ చరణ్ ఇంటర్వ్యుల్లో చెప్పిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ల గోల్స్ ఎప్పుడు రీచ్ అవుతారో..పిల్లల్ని ఎప్పుడు కంటారో..?