మళ్లీ సైకిల్ ఎక్కిన చరణ్.. దానికోసమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌కు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో చరణ్ ఓ సైకిల్‌పై వెళ్తూ కనిపించాడు. ఈ సినిమాలో చరణ్ ఓ ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన గెటప్ మార్చి సైకిల్‌పై వెళ్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏదేమమైనా ప్రస్తుతం చరణ్ సైకిల్ ఎక్కిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.