ప్రభాస్ అన్ని రోజుల్లో ముగించేస్తాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో దమ్ములేకపోవడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా షాక్ నుండి కోలుకున్న ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ చిత్రాలను పూర్తి చేసేలోగా, ఓ చిన్న సినిమాను చేయాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను పూర్తి హార్రర్ కామెడీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ 40 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమాను ముగించేయాలని ప్రభాస్ చూస్తున్నాడు.

ఇంత తక్కువ టైమ్‌లో ప్రభాస్ ఈ సినిమాను ముగించేస్తాడా అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే, మారుతి తన సినిమాలను ఎంత స్పీడుగా ఫినిష్ చేస్తాడో మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా మారుతి తన ప్లానింగ్‌తో దూసుకెళ్లనున్నాడని.. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడమే కాకుండా ఫినిష్ చేయాలని కూడా చిత్ర యూనిట్ చూస్తోంది. మరి 40 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేస్తే.. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాలి.