పెళ్లికి రెడీ అంటోన్న పవన్ హీరోయిన్.. వరుడు కూడా రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. పవన్ సరికొత్త లుక్‌లో కనిపించినా, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నిఖీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అమ్మడికి ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో మరొక ఆఫర్ అంటూ ఏమీ రాలేదు.

ఈ సినిమా దెబ్బకు నిఖీషా పటేల్ బాలీవుడ్‌లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే ఇంతకాలానికి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఇటీవల నిఖీషా తన పెళ్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని నిఖీషాను అడగ్గా.. తాన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యినట్లు.. వరుడు కూడా రెడీగా ఉన్నట్లు ఆమె పేర్కొంది.

తనకు కాబోయేవాడు యూకెలో ఉంటాడని.. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు నిఖీషా తెలిపింది. ఈ వార్తతో నిఖీషా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన అందాలతో అభిమానులకు ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు పెళ్లిచేసుకోబోతుందని తెలిసి వారు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.