భవదీయుడు డైలాగ్ లీక్.. ఎలివేషన్ అంటే ఇది!

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఏకకాలంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప‌డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు.

కాగా తాజాగా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో పవన్ పాత్ర ఓ రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ఉండబోతుందని.. అది వింటే అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో విలన్‌ను ఎదుర్కొనేందుకు పవన్ వెంట వందలాది మంది స్టూడెంట్స్ వస్తారు. అప్పుడు ఆ విలన్.. మొన్న వీడు ధైర్యంగా మాట్లాడితే వాడి ధైర్యం ఏంటా అనుకున్నాను, వీడి వెనకాల ఇంతమంది ఉన్నారా.. అని అంటాడు.. అప్పుడు విలన్ పక్కనే ఉన్న వ్యక్తి ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నారని కాదు, ఆ లక్ష మంది ముందు తాను నడుస్తున్నాడన్న ధైర్యం.. అని పవన్‌ని హైలైట్ చేస్తూ చెప్పే డైలాగ్ సూపర్బ్ గా ఉండనుంది. ఈ డైలాగుకు థియేటర్లలో విజిల్స్ మోత మోగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఏదేమైనా అప్పుడు భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటం విశేషం.

Share post:

Popular