నా లైఫ్ లో ఎప్పుడు అలా చేయను..కీర్తి సురేష్ కి ఏమైంది..?

కీర్తి సురేష్.. ఓ కుందనపు బొమ్మల ఉంటుంది. చూడటానికి చక్కటి అందం..చూడగానే ఆకట్టుకునే చిరు నవ్వు.. పెద్ద పెద్ద కళ్ళు..ఆ కళ్లతోనే ఎటువంటి ఎక్స్ ప్రేషన్ ని అయిన పలికించగలదు. అంత టాలెంటేడ్ ఉన్న నటి. మనకు తెలిసిందే మొదటి నుండి కీర్తి చాలా సెలక్టెడ్ సినిమాలకు సైన్ చేస్తూ వస్తుంది. సినిమా హిట్ కాకపోయినా పర్లేదు.. జనాల్లోకి వెళ్ళితే చాలా.. అంటూ ఢిఫరెంట్ గా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. ఈరోజుల్లో ఇలాంటి హీరోయిన్ దొరకడం చాలా కష్టం. మహానటి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అమ్మడు..ఇప్పుడు సక్సెస్ కోసం దారులు వెత్తుకోవాల్సి వస్తుంది.

పాపం కీర్తికి మహానటి సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. కానీ, ఆఫర్లు మాత్రం వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. అది అదృష్టం అంటే.. డైరెక్టర్స్ కి ఆమె పై ఉన్న నమ్మకం అంటే. ప్రతి సినిమాలో వెరీయేషన్స్ చూయిస్తూ వస్తున్న కీర్తి దగ్గరకు ఓ అద్దిరిపోయే కధ వచ్చిందట. అది విని కీర్తి కూడా ఫిదా అయిపోయిందని టాక్. పేరుకి చిన్న డైరెక్టర్ అయినా కానీ సీన్స్ బాగా రాసారట. మధ్య మధ్యలో సస్పెన్స్ పెట్టి సినిమాకి అదనపు బలం తెచ్చిన్నట్లు తెలుస్తుంది.

కానీ, ఈ కధను రిజెక్ట్ చేసిందట కీర్తి. దానికి కారణం ఆ పాత్ర మరీ టూ గ్లామరస్ గా ఉండటం. సినిమా లో హీరోయిన్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందట. లిప్ కిస్..లు రెండు మూడు బెడ్ సీన్స్ లో కూడా నటించాలసి వస్తుందని కీర్తి సినిమా ని దూరం పెట్టిన్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, మరోసారి డైరెక్టర్లకి అర్ధమైయ్యేలా కోట్లు ఇచ్చినా బోల్డ్ రోల్స్ లో చేయను..దయచేసి అలాంటి కధను నా దగ్గరకు తీసుకురాకండి అంటూ చెప్పుకొచ్చిందట. కీర్తి తీసుకున్న నిర్ణయం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేశావు అంటూ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ కీర్తి వరుస సినిమాలతో బిజీ గా ఉంది.