దానికి నో చెప్పినందుకు..ఆ హీరో చేసిన పని ..ఎప్పటికి మర్చిపోలేను..!!

సినీ ఇండస్ట్రీలో ఓ పదం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువుగా వినిపిస్తుంది. అదే “క్యాస్టింగ్ కౌచ్”. ఇంకో పేరు కూడా ఉందండోయ్.. కమిట్ మెంట్. మీరు ఎదైన సినిమాలో నటించాలని అనుకున్నా.. లేదా..అవకాశాలు రావాలి అన్నా..సదరు డైరెక్టర్ లేదా నిర్మాత..లేదా హీరోల కోరికలు తీర్చాల్సిందే. అందరు ఇలా అడుగుతారా అని చెప్పలేం కానీ.. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు అని అంటున్నారు. బడా హీరోయిన్స్ సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటుంటేనే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఈ ఇష్యూ పై స్పందించగా.. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కూడా ఆ లిస్ట్ లో కి చేరిపోయింది. ఇషా కొప్పికర్‌ గురించి తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి..మెప్పించి..అభిమానుల చేత మంచి మార్కులే వేయించుకుంది. కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. దానికి రీజన్ ఇదే కాబోలు.

రీసెంట్ గా అమ్మడు మాట్లాడుతూ..అప్పట్లో తనకి ఎదురైన సంఘటనలు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. ఓ స్టార్ హీరో పెరు ఉన్నా..డబున్న..టాలెంటెడ్ ఉన్నా హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకుందట. ఆ విషయాని చెప్పడానికి కాల్ చేసి ఓ సో కాల్డ్ డైరెక్టర్ ఇషా కొప్పికర్‌..తో నీ పేరు ఆ స్టార్ హీరో లిస్ట్ ఉంది అని చెప్పుకొచ్చాడట, మొదట పరిస్ధితి అర్ధం చేసుకోలేకపోయిన ఈ అమ్మడు..ఆ తరువాత హీరో కాల్ చేసి..నువ్వు నా రూమ్ కి రా.. ఎవ్వరు వద్దు..నువ్వు సింగిల్ గా రా అంటూ తేడా గా మాట్లాడటంతో పరిస్ధితి అర్ధమైపోయిందట. వెంటనే డైరెక్టర్ కి కాల్ చేసి..బండ బూతులు తిట్టి..నా క్యారెక్టర్ అలాంటి కాదు..టాలెంట్ తోనే అవకాశాలు తెచ్చుకుంటా అంటూ..ఫైర్ అయ్యిందట. ఇక ఫైనల్ గా ఆ హీరో ఇషా కొప్పికర్‌ ని ఆ సినిమా నుండి తప్పించారట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..ఆ హీరోతో ముందే అమ్మడు ఓ సినిమా చేసిందట. ఈ విషయం నా హృదయం ముక్కలు చేసిందని చెప్పుకొచ్చింది ఇషా కొప్పికర్‌.