లక్కంటే ఇదిరా భయ్‌..అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న ‘DJ TILLU ‘ హీరో ..?

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవ్వరికి తెలియదు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ నే ఈ యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ. ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమా తో తన పేరు ను మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్స్‌ చేసినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోని ఈయన.. డీజె టిల్లు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా..ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకుని..జూనియర్ విజయ్ దేవరకొండా అనే పేరు ను సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా ఈ సినిమా లో ఆయన చెప్పే డైలాగ్..”ఈ క్వశ్చన్ నిజంగానే నువ్వు నన్ను అడుగుతున్నావా రాధిక..?” అనే డైలాగ్స్ పై ఎన్ని రీల్స్ చేశారో జనాలు. అంతలా ఈ సినిమా ద్వారా జనాలకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో సిద్ధు. డీజె టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత సార్ ఏ సినిమా చేస్తున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తుండగా.. ఓ బంపర్‌ ఆఫర్ కొట్టేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు ఏకంగా బడా ప్రోడ్యూసర్ తో ఈయన సినిమా కన్ఫామ్ అయ్యిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

ఇండస్ట్రీలో స్టార్ ప్రోడ్యూసర్ గా రాజ్యమేలుతున్న దిల్‌రాజు ..సిద్ధు కి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే సిద్ధు మంచి రైటర్ అని..ఆయన లోని టాలెంట్ గుర్తించిన దిల్ రాజు..ఓ అద్దిరిపోయే కధను ఫైనల్ చేసి..సిద్ధు ఊహించని రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశాడట. దీంతో సిద్ధు పేరు ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుమ్రోగిపోతుంది. లక్కంటే ఇదిరా భయ్‌ అని సిద్దు జొన్నల గడ్డను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు మిగతా హీరోలు. అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్మీడియట్‌ గా ఈ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు. డీజె టిల్లు తిరుగులేని విజయం అందుకున్న ఈ యంగ్ హీరో..దిల్ రాజు తో ఎలాంటి హిట్ కొడతాడొ వేచి చూడాలి. ఒక్కవేళ ఈ సినిమా హిట్ అయితే..ఇక సిద్ధుకి తిరుగులేదంటున్నారు సినీ విశ్లేషకులు.