బర్త్ డే వేడుకల్లో నటి ప్రగతి హాట్ హాట్‌గా..!

టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా అని వారిని ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. వారిలో కొందరు స్టార్ నటీనటుల కంటే వందశాతం బెటర్ అని చెప్పాలి. ఇక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అలాంటి వారు మనకు చాలా మంది వెండితెరపై కనిపిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే.

ఆమె ఎక్కువగా తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమె దూకుడు ఓ రేంజ్‌లో ఉంది. పొట్టి బట్టల్లో ప్రగతి ఆంటీ.. సారీ బ్యూటీ.. చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఇటీవల ఆమె వరుసగా తన జిమ్ వీడియోలు, హాట్ ఫోటోషూట్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కాగా తాజాగా ఆమె తన పుట్టినరోజును సెలిబ్రేట్ చేసుకుంది.

ఈ వేడుకలో ప్రగతి చాలా హాట్‌గా కనిపించగా..తన స్నేహితురాళ్లతో కలిసి గ్రాండ్‌గా బర్డ్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్‌లో ప్రగతి ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రగతి ఆంటి ఏజ్ పెరగడం ఆగిపోయిందా అనేలా ఈ బ్యూటీ రోజురోజుకూ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.