బిగ్ షాకింగ్: అలియా- ర‌ణ్‌బీర్‌ ల పెళ్లి వాయిదా…ఎందుకంటే..?

యస్.. బాలీవుడ్ లవ్ బార్డ్స్ అలియా-ర‌ణ్‌బీర్‌ ల పెళ్ళి వాయిదా పడిందంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత రెండు వారాల నుండి లోకల్ మీడియా టూ నేషనల్ మీడియా అన్ని ఛానెల్స్ లోని అలియా-ర‌ణ్‌బీర్‌ ల పెళ్లి మ్యాటర్ నే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అలియా పెళ్లికి సంబంధించిన కాస్ట్యూమ్‌స్..బ్యాచిలర్ పార్టీ ..పెళ్లికి వచ్చే గెస్ట్లు..పెళ్లిలో పెట్టే ఫూడ్ ఐటెంస్..అబ్బో నానా హంగామా నడుస్తుంది. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్య పోయేలా స్పెషల్ గా ఈవెంట్ మ్యానేజర్స్ ని పిలిపించి పెళ్లి పనులు చేయిస్తున్నారట.

అయితే, కొద్దిసేపటి క్రితమే ఓ బ్రేకింగ్ న్యూస్ వినిపించింది. అది ఏమిటంటే.. అలియా-ర‌ణ్‌బీర్‌ ల పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. నిజానికి అన్నీ బాగుంటే వీళ్ల పెళ్లి ఏప్రిల్ 15 న గ్రాండ్ గా జరిగి ఉండాల్సింది. కానీ, అలియా సన్నిహితుల దగ్గర నుండి పెళ్లి కి సంబంధించిన ప్రతి మ్యాటర్ లీక్ అవ్వడంతో.. సెలబ్రిటీల భద్రతా దృష్ట్యా పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంగీత్, హల్దీ , మెహందీ ఈ మూడు వేడుకలు మాత్రం అనుకున్న టైంకి జరిగిపోతాయట.

కానీ, పెళ్లి మాత్రం ఏప్రిల్ 20 న జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాని స్వయంగా అలియా బ్రదర్ రాహుల్ ఓ ప్రముఖ ఛానెల్ కు తెలియజేశారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అలియా-ర‌ణ్‌బీర్‌ లు తమ పెళ్లిని తొలుత డెస్టినేషన్ వెడ్డింగ్ స్టయిల్‌లో చేసుకుంటామని అనుకున్నారట. అయితే రణ్‌బీర్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లోనే వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారట. దీంతో అక్కడే వీళ్ల పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా వీళ్ల పెళ్లి గురించి రోజుకో వార్త మీడియాలో ట్రెండింగ్ అవుతుండడం అభిమానులకు గజిబిజీ గందరగోళంగా ఉంది.