అక్కినేని శాపం సమంతకి గట్టిగానే తగ్గిలిన్నట్లుందే..?

యస్..ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట మారు మ్రోగి పోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కి అక్కినేని వారు పెట్టిన శాపం తగిలింది అంటూ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చి..వేరుగా ఉంటున్న సంగతి. వీళ్లు విడాకులు తీసుకోవడానికి కరెక్ట్ రీజన్స్ తెలియవు కానీ..అందరు సమంత సినిమాల వల్లే అక్కినేని కోడలు ట్యాగ్ ని వదిలేసుకుంది అంటూ చెప్పుకుంటున్నారు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తరువాతనే ఈ రచ్చ మొదలైంది అనేది వాళ్ళ అభిప్రాయం.

దీని పై అటు సమంత ఇటు నాగ చైతన్య ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో వీళ్ల మధ్య ఏదో బిగ్ వార్ జరిగిన్నట్లు అర్ధమైపోయింది. సమంత స్టార్ హీరోయిన్ అని విర్రవీగుతుందని..ఆ ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని..అక్కినేని ఇంటి వాళ్ళు సమంత విడాకుల టైంలో అనుకున్నారట. ఇప్పుడే అదే మాట నిజమైంది. సమంత విడాకులు తీసుకున్నప్పటి నుండి సినిమాలకి కమిట్ అవుతుందే కానీ..రిజల్ట్ ఎలా ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప ఐటెం సాంగ్ హిట్ అయ్యిందంతే..ఆ తరువాత వచ్చిన కాతువాకుల రెండు కాదల్ సినిమా దారుణంగా పడిపోయింది.

సమంత నెక్స్ట్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ టైంలోనే అక్కినేని వారి శాపం సమంతకి తగ్గిలిన్నట్లుంది..అందుకే.. ఇలా జరుగుతుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో పక్క సమంతకి సినిమా అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. తెలుగులో ఆమె ఫ్రేష్ గా కమిట్ అయిన సినిమా విజయ్ దేవరకొండ ఒక్కడిదే..ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని ముందు కమిట్ అయ్యినవే. మరీ చూడాలి సమంత తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటుందో ..లేదో..?