అదే నిజం అయితే.. కొరటాల నెక్స్ట్ సినిమా కూడా దొబ్బేసిన్నట్లే..?

పాపం కొరటాల శివ.. కెరీర్ లో అపజయం అన్న మాట కు తావు లేకుండా హ్యాపీ గా సాగిపోతున్న సినీ కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ రుచి చూశాడు. మెగాస్టార్ చిరంజీవి తో ఆయన ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. మధ్యలోకి ఆయన కొడుకు చరణ్ ని కూడా లాక్కోచ్చారు. సరే, ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఖచ్చితంగా హిట్ అనుకున్నారు. కానీ, బొమ్మ పడగానే మాట మారిపోయింది. పరమ చెత్త సినిమా అంటూ రీవ్యూ ఇచ్చేశారు జనాలు. అంతేనా కొరటాల నుండి ఇది కాదు మేము ఎక్స్ పెక్ట్ చేసిందంటూ లైవ్ లోనే చెప్పేస్తున్నారు.

ఇక సినిమా ఫ్లాప్ అనగానే ముందు అందరి కళ్ళు రాజమౌళి వైపే చూసాయి . జనరల్ గా ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ సెంటి మెంట్ ఉంది. జక్కన్న తో సినిమా తీస్తే ఆయన తరువాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని. ఇప్పటి వరకు అలానే జరిగాయి కూడా. అయితే ఆచార్య విషయంలో అందరు ఆ సెంటి మెంట్ బ్రేక్ అవుతుంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. రాజమౌళి సెంటి మెంట్ నే నిజమైంది. కొరటాల కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ అందుకున్నాడు ఆచార్య సినిమాతో. ఈ సినిమాలో చరణ్ చేసింది చిన్న పాత్రనే.. కానీ, ఆ బ్యాడ్ లక్ మాత్రం వదలలేదు అంటూ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఇప్పుడు అందరి చూపు కొరటాల నెక్స్ట్ సినిమా పై పడింది. మనకు తెలిసిందే కొరటాల తారక్ తో ఓ సినిమా చేస్తున్నాడని.. ఆ సినిమా జూన్ లో ప్రారంభం కానుందని. ఇక ఇప్పుడు ఈ సినిమాకి రాజమౌళి భయం పట్టుకుంది. ఎందుకంటే తారక్ RRR సినిమాలో నటించాడు. వెంటనే కొరటాలతో చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ కు ఫ్లాప్ ఇచ్చిన కొరటాల..ఆ సెంటి మెంట్ తో తారక్ సినిమా కూడా ఎక్కడ నిరాశ పరుస్తాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కానీ, మరో పక్క తారక్ మీద ఉన్న నమ్మకంతో..సినిమా పై కొత్త ఆశలు పెట్టుకుంటున్నారు. మరి రాజమౌళి సెంటి మెంట్ ని తారక్ బ్రేక్ చేస్తాడో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..!!