పూజా హెగ్డే ఇక పని “కి” రాదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే .. వరుస అవకాశాలతొ రై రై మంటూ దూసుకుపోతుంది. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొసం చాలా కష్టపడ్డా..ఆ త్రౌవాత ఎలాగోలా ఫాం లోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుండి పూజా టైం మామూలుగా లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు సైన్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేనా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో డైరెక్టర్ నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది..ఈ టాలీవుడ్ బుట్ట బొమ్మ.

అయితే , రీసెంట్ గా అమ్మడు చేసిన లాస్ట్ మూడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నటించిన “రాధే శ్యామ్”..సినిమా రిలీజ్ కి ముందు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారో అభిమానులు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పూజా భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత వచ్చిన బీస్ట్ సినిమా గురించి అసలే చెప్పక్కర్లేదు. సినిమాలో హీరోయిన్ ఉందా లేదా అన్నట్లు కొద్ది సేపు కనిపించి మాయం అయిపోయింది. ఆ అరబిక్ కుతూ స్టెప్ వల్ల పూజా హీరోయిన్ గా ఉంది ఈ సినిమాలో అనుకున్నారే కానీ..లేకపోయుంటే సినిమాలో హీరోయిన్ లేన్నట్లే.

ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద దారుణంగా పడిపోయింది. కోలీవుడ్ లో సెటిల్ అవుద్దాం అనుకున్న ఆమె కలలు ..కలలుగానే మిగిలిపోయాయి. ఇక నేడు రిలీజ్ అయిన ఆచార్య. అబ్బో ఈ సినిమా గురించి ఎంత చెప్పితే అంత తక్కువ .. ఇద్దరు హీరో ల మీదా కాన్సెన్ట్రేషన్ చేశాడు..కొరటాల కానీ, పూజా ను అసలు పట్టించుకోనే లేదు. లుక్స్ పరంగా ఆకట్టుకున్న నటన పరంగా పెద్ద స్కోప్ లేదు పూజా కి..దీంతో ముచ్చట గా మూడో సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో పూజా హీరోయిన్ గా ఇక పనికిరాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న నాలుగు సినిమాలే తప్ప కొత్త ఆఫర్లు కూడా రావడం లేదు.. మళ్ళీ ఐరెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంటుందో ఏమో..?

Share post:

Latest