ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ను ఇలా చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన స్టార్ బ్యూటీలు ఆ తరువాత ఆఫర్లు లేకనో, పెళ్లిల్లు చేసుకునే తమ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టడం కామన్. అయితే చాలా వరకు హీరోయిన్లు ఫేడవుట్ అయ్యే సమయంలో ఇలా చేస్తుంటారు. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగా, స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పుడు ఎవరైనా సినిమాలకు దూరం అవుతారా.. అంటే.. కాదనే చెప్పాలి. కానీ మన అచ్చ తెలుగు హీరోయిన్ అయిన లయ మాత్రం ఇలా చేసి అందరికీ షాకిచ్చింది.

హీరోయిన్‌గా వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అభిమానులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తరువాత లయ ఫోటోలు అడపాదడపా సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప, ఇప్పటివరకు ఆమె సినిమాల్లోకి రీఎంట్రి ఇచ్చింది లేదు. అయితే తాజాగా లయకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. లయ ఏమిటి.. ఇలా చేస్తుందని వారు ముక్కున వేలుసుకుంటున్నారు.

ఇంతకీ లయ అంతగా ఏం చేస్తుందా అని మీరు అనుకుంటున్నారా.. ఆమె ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలోని ‘కళావతి’ పాటకు ఆమె వేసిన స్టెప్స్ అద్భుతంగా ఉండటంతో అభిమానులు ఆమె అందం ఇంచు కూడా తగ్గలేదని, ఆమె డ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదేమైనా చాలా రోజుల తరువాత లయ పేరు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ తిరిగి సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)