అక్కినేని ఇంటి కొత్త కోడలు పిల్ల పేరు ఇదే..మూహుర్తం ఫిక్స్..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే..అక్కినేని వారి పెళ్లి సందడి. నిజంగా నాగార్జున పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఇంట హంగామ నడిచిఉండదు. అలా..ఇప్పుడు వాళ్ల పెళ్లి టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లు కాపురం చేశాక..ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వేరుగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

అయితే, తాజాగా నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. జనరల్ గా ఇలాంటి వార్తలు వచ్చిన్నప్పుడు నాగార్జున వెంటనే రెస్పాండ్ అయ్యి.. అలాంటిది ఏం లేదు..అవి ఫేక్ న్యూస్ అని చెప్పుకొస్తాడు. కానీ ఈసారి అలా ఏం రెస్పాండ్ కాకపోవడంతో ఈ న్యూస్ నిజమే అని అంతా అనుకుంటున్నారు. మరో పక్క అక్కినేని అభిమానులు అయితే కొత్త కొడలు పిల్ల ఎవరు అంటూ..సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

కాగా, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అమ్మాయి పేరు..పూజిత అంటూ ఓ న్యూస్ లీక్ అయ్యింది. ఇండస్ట్రీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నాగార్జున చిన్న నాటి స్మేహితుడి ఫ్రెండ్ కూతురు. అమెరికాలో చదువుకునిందట. నాగార్జున కు ఆయనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండటంతో పరిస్ధితులు అన్ని తెలిసినా.. పూజితా కూడా ఒప్పుకోవడంతో పెళ్లి ని ఫిక్స్ చేశారట కుటుంబ సభ్యులు. మొదటిసారి ప్రేమ వివాహం అంటూ తప్పు చేసినా చై..ఈసారి నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో అఫిషియల్ గా చైతన్యకు-సమంత కు విడాకులు మంజూరు అవుతాయాని..ఆ తరువాత వెంటనే నిశ్చితార్ధం ఆ తరువాత పెళ్లి అంటూ ఇప్పటికే కుటుంబ సభ్యులు మాటలు అనుకునేశారట. ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే.. నాగార్జున మొదటి భార్య కి కూడా పూజిత వాళ్ల నాన్న ఫ్రెండ్. అందుకే ఈ సంబంధం ఇంత ఈజీగా వర్క్ అవుట్ అయ్యిందంటున్నారు సన్నిహిత బంధువులు. మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి..?