RRR Movie: చరణ్‌ కంటే ఎన్టీఆర్ పాత్రనే హైలెట్ చేశారా..?

కేవలం తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్దాయిలో జనం వెయిట్ చేస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”. బాహుబలి లాంటి సినిమా హిట్ తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దాదాపు మూడేళ్లు తెరకెక్కించిన సినిమా ఇది. పైగా కళలో కూడా ఊహించని..కాంబోని సెట్ చేయడంతో అభిమానులు ఈ సినిమా పై ఓ రేంజ్ భారీ ఎక్స్ పెక్స్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..కలిసి నటించిన ఈ చిత్రం ఎప్పుడో మన ముందుకు రావాల్సింది. కానీ కొన్ని సార్లు షూట్ లేట్ అవ్వడం..మరికొన్ని సార్లు కరోనా..అదే టైంలో ఏపీలో టికెట్ ఇష్యూ..ఇలా వరుస కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్న ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ..ఈ నెల 25 న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్.

ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ పనుల్లో బిజీ అవుతున్నారు. రాజమౌళి సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు..ఆ సినిమాలకు తగిన రీతీలో ప్రమోషన్స్ కూడా చేస్తారు. అందులో ఆయన స్టైల్ నే వేరు. అయితే సినిమా డేట్ దగ్గరపడే కొద్దు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సినిమాలో ఇద్దరు బడా హీరోలు ఉన్నారు కధ..ఇద్దరికి ఒకే విధమైన ప్రాధ్యానత ఇచ్చారా..లేక మొదటి నుండి తారక్ అంటే రాజమౌళి కి ఇష్టం కదా..పైగా సీనియర్ కాబట్టి ఈ సినిమాలో చరణ్ తో కంపేర్ చేస్తే తారక్ రోల్ నే బాగా డిజైన్ చేసుంటారు అని డిస్కషన్స్ మొదలైయాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన్నప్పుడే ఈ విషయం పై పలువురు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మా హీరోని తక్కువ చేసి చూపిస్తే ఊరుకోం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తీరా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ గా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కానీ కొందరు సినీ విశ్లేషకుల మాటలు బట్టి.. రాజమౌళి ప్రజల నాడి పట్టేశాడు..ఏ హీరోకి ఎంత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు..రాజమౌళి మాత్రం అలాంటి పొరపాట్లు చేయరని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు తారక్‌, చరణ్‌లకు ఈ చిత్రం సక్సెస్ చాలా అవసరం అనే సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ కూడా బాక్సాఫీస్ వద్ద మరెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Share post:

Popular