తప్పు చేస్తున్న విజయ్ దేవరకొండ..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినీ ఇండస్ట్రీ అంటే మాయ లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. సో..మనం తీసుకునే ప్రతి డేసీషన్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలి..లేదంటే కధలో తేడాలు వచ్చేస్తాయి. తద్వారా భారీ బొక్క పడే ఛాన్స్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే స్టార్ హీరోలు తమ తమ సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలి..స్టోరీ ఏ విధంగా ఉందాలి..ఆ స్టోరీ మన బాడీ లాంగ్వేజ్ కు మ్యాచ్ అవుతుందా..? అలాంటి పాత్రల్లో జనాలు మనల్ని చూసి ఆదరిస్తారా..?

ఇలా ప్రతి హీరో ఆలోచించి తమ సినిమాల విషయాలల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో యంగ్ లెటేస్ట్ సెన్సేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. మొదటి నుండి విజయ్ తన సినిమాల విషయంలో పక్క క్లారిటీ తో వెళ్తున్నాడు. అందుకే అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయి..అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా..ఇప్పుడు విజయ్ చేస్తున్న పనులు ఆయనను ఇబ్బందులోకి నెట్టివేస్తాయా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

ప్రజెంట్ విజయ్ పూరి డైరెక్షన్ లో “లైగర్” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తరువాత మళ్లీ పూరీ దర్శకత్వంలోనే “జన గణ మన” అనే సినిమా తీయ్యబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. కాగా లేటేస్ట్ సమాచారం ప్రకారం..విజయ్ శివ నిర్వాణ డైరక్షన్ లో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి భారి హైప్ రావడానికి సమంతను హీరోయిన్ గా తీసుకోనున్నారట. అయితే దీని పై విజయ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నానికి టక్ జగదీష్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ సినిమా చేయడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. గత కొంత కాలంగా హిట్ లేని విజయ్ కు “లైగర్” సినిమా సక్సెస్ అయితే ఓకే.. లేదంటే మరో ఫ్లాప్ ఖచ్చితంగా తన ఖాతాలో వేసుకుంటాడు అంటున్నారు నెటిజన్స్. ఒక్కవేళ లైగర్, అలాగే శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చే సినిమాలు రెండు ఫ్లాప్ అయితే విజయ్ కెరీర్ కే ప్రమాదం..అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?