పవన్ డైరెక్టర్ ను పక్కన పెట్టేసిన బన్నీ..కొత్త తలనొప్పులు ఎందుకయ్యా.?

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానివ్వండి.. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఒక్క డైరెక్టర్ తో కమిట్ అయిన సినిమాను హోల్డ్ లో పెట్టి మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అందులో తప్పులేదు. బడా బడా హీరోలు కూడా అలా చేసి వచ్చిన వాళ్లే. కానీ ఒక్కసారి మనం కమిట్ అయిన సినిమాని వదులుకోవాల్సి వస్తే..? దానికి రీజన్ లేకపోతే..? ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కు హీరో కు మధ్య యవ్వారం చెడ్డిందనే అర్ధం. ఇప్పుడు ఆ విధంగానే బన్నీకి-వేణు శ్రీరామ్ కి మధ్య ఏదో తెలియని గ్యాప్ వచ్చిన్నట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్‌..ఎంతటి ఘన విజయాని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ వేణు శ్రీరామ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ను పక్కన పెట్టేశాడు బన్నీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పవన్ తో వకీల్ సాబ్ కన్నా ముందే బన్నీ తో ఐకాన్ అనే మూవీని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట వేణు. కానీ బన్నీ కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం తో.. ఈ గ్యాప్‌లో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చేసేశాడు.

అయితే, పుష్ప ది రైజ్ తరువాత కొన్ని కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి..రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేద్దామని..మళ్ళీ మిగతా షూటింగ్ పూర్తి చేద్దామని అనుకున్నారట బన్నీ-వేణు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ను హీరోయిన్ గా తీసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారట. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం..ఈ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు బన్నీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ.. వేణూ కాల్ చేసినా..మాట్లాడానికి ట్రై చేస్తున్నా కావాలని బన్నీ ఆయనను అవాయిడ్ చేస్తున్నాడట. దీంతో మ్యాటర్ అర్ధం చేసుకున్న వేణు..ఐకాన్ సినిమాను యంగ్ హీరో రామ్ తో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట. దీంతో బన్ని కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్లైంది. అసలే పవన్ తో బన్నీకి గొడవలు .. అందుకే భీంలా నాయక్ సినిమా పై రెస్పాండ్ కాలేదు అంటూ వార్తలు వస్తున్న క్రమంలో బన్నీ ఇలా చేయడం ..కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి బన్నీ దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి..?