ప్రాబ్లమ్‌స్ వస్తాయని నాకు తెలుసు..అసలు విషయం బయటపెట్టేసిన సమంత..!!

జీవితం అంటే అన్ని కలగల్సిన ప్రయాణం. ఎప్పుడు సుఖాలు,సంతోషాలు ఉండాలి రావాలి అంటే కుదరదు. అప్పుడప్పుడు సమస్యలు,సవాళ్లను కూడా ఎదురుకోవాలి..అప్పుడే మనం లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్లగలం. ఇప్పుడు ఇలాంటి నీతి భోధనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది సమంత. ఒకప్పుడు అమ్మడు ని చూసి కుళ్లుకునే వాళ్లు..”అబ్బా..సమంత స్టార్ హీరోయిన్..పైగా పెద్దింటి కోడలు ఇంకేవాలి..సమంత లక్కి” అంటూ పొగిడేసేవారు. కానీ సీన్ కట్ చేస్తే..

అదే జనాలు ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. “సినిమాల మోజులో బంగారం లాంటి భర్తను దూరం చేసుకున్నావు.. చైతన్య లాంటి వ్యక్తిని కాదు అనుకున్నావు..నీ అంత అన్ లక్కి గార్ల్ ఎవ్వరు ఉండరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయినా కానీ సమంత ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా..తన లైఫ్ లో ముందుకు వెళ్లాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా ఉంటుంది.

ఇక ఎంత బిజీ గా ఉన్నా సమంత తన పెట్స్ తో టైం గడుపుతుంది. కొన్ని సార్లు షూటింగ్ లోకేషన్లకు కూడా తీసుకెళ్లి ఫోటోలు షేర్ చేసింది. అంత ఇష్టం సమంతకి పెట్స్ అంటే. ఇక సమంత తన పెట్స్ కు సంబంధించి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సమంత వర్క్ అవుట్స్ చేస్తున్న క్రమంలో తన పెట్స్ హాష్‌, సాషా లు వచ్చి తెగ అల్లరి చేశాయి. అంతేకాదు గొడవలు పడుతూ సమంత ను వదలలేదు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేస్తూ..”జీవితంలో సిబ్లింగ్స్‌ మధ్య ప్రాబ్లమ్‌స్ వస్తుంటాయని నాకు తెలుసు” అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చి మరీ పోస్ట్ చేసింది. కాగా గొడవ పడ్డా మళ్లీ ఒక్క నిమిషంలోనే అవి కలిసిపోయాయంటూ ఫోటోలను షేర్‌ చేసింది. ఇక దీని ద్వారా సమంత గొడవలు పడ్డా మళ్లి కలిసిపోతేనే లైఫ్ బాగుంటుంది అని పరోక్షంగా ..తన మనసులోని మాట చెప్పేసింది..అంటూన్నారు నెటిజన్స్. మరి చూడాలి సమంత ఇంకెమన్నా గుడ్ న్యూస్ చెప్పుతుంది ఏమో..?