ఆ హీరో కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇష్యూ..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. ఎవరి సహాయం లేకుండా ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా కేవలం కష్టానే నమ్ముకుని..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే ఏలేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఆయన కృషి పట్టుదల శ్రమనే కారణం. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనేది ఆయన నమ్మకం. అదే విషయాని చాలా సినిమా ఈవెంట్లల్లో..పలు ఇంటర్వ్యులల్లో మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు.

ఇక మనకు తెలిసిందే ..చిరంజీవి ఆదర్శంగా తీసుకుని మన ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు అడుగుపెట్టారు. కొందరు ఆయన పేరు వాడుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చారు . మనం చూసుకున్నట్లైతే ఇండస్ట్రీలో సగం మంది హీరోలు వాళ్ల ఇంటి నుండే రావడం గమనార్హం. కానీ అందరు సక్సెస్ అయ్యారు అని చెప్పలేం. కొందరు ఫ్లాప్ సినిమాలు కూడా రుచి చూశారు. ఒక్కటంటే ఒక్క సరైన హిట్ సినిమా కూడా పడలేదు.

అలాంటి వాళల్లో మెగా అల్లుడు “కళ్యాణ్ దేవ్” కూడా ఒకరు. చిరంజీవి చిన్న కూతురిని రెండొ పెళ్లి చేసుకున్న ఈయన మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడు వాళ్ల మధ్య వచ్చిన సమస్యల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మెగా అల్లుడు కూడా సినిమాలో తన లక్ పరీక్షించుకున్నాడు. అరా కొరా సినిమాలు చేశాడు కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు..పాజీటివ్ టాక్ తెచ్చుకోలేదు. అయితే కళ్యాణ్ దేవ్ కి సినిమాల పరంగా చిరు గట్టి వార్నింగ్ ఇచ్చారట. తన పేరు చెప్పుకుని ఓ డైరెక్టర్ ని ఇంటికి పిలిపించుకుని..చిరు చెప్పాడని చెప్పి తనతో సినిమా తీయ్యాలని అడిగారట. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఈ విషయం ఎవ్వరికి తెలియకుండానే మ్యానేజ్ చేసిన్నట్లు వార్తలు వినిపించాయి. ఫైనల్లీ చిరుకి ఈ మ్యాటర్ లీక్ అవ్వడంతో..కళ్యాణ్ కు గట్టిగానే క్లాస్ పీకారట..ఇంకోసారి ఇలాంటివి చేస్తే క్షమించను అంటూ వార్నింగ్ ఇచ్చాడట. ఇక “ఇగో ” హర్ట్ అయిన కళ్యాణ్ కి అప్పటి నుండి చిరు తో గొడవలు జరుగుతూనే ఉన్నాయని..కానీ మెగా ఫ్యామిలీ దాచ్చేస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకే చాలా విషయాలల్లో శ్రీజ ని కూడా బాధపెడుతూ వచ్చాడట కల్యాణ్ దేవ్.