పొద్దున్నే ప్రేమించి సాయంత్రం పెళ్లి చేసుకున్న హీరోయిన్‌..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమ వివాహం చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ ప్రేమ, పెళ్లి గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈమె వివాహం ఒక సినిమాలో మాదిరిగా జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక అసలు విషయంలోకి వెళితే ఆ హీరోయిన్ పేరు తులసి శివమణి. ఈమె 1967 జూన్ 20వ తేదీన జన్మించినది. చిన్న వయసులోనే చైల్డ్ యాక్టర్ గా, మదర్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.

ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించింది. ఇక తను మూడు నెలల పాపగా ఉన్నప్పటికీ కూడా ఈమె భార్య అనే చిత్రం తో ఒక పాప గా తెరంగేట్రం చేసింది. ఇక ఆ సినిమాలో పాట కి ఒక పాప కావాల్సి ఉండడంతో నాటి ఎవర్‌గ్రీన్ హీరోయిన్ సావిత్రి, తన స్నేహితురాలైన ఈమె తల్లిని ఒప్పించి ఈ పాటలో ఈ పాపని నటించేలా చేసినది. ఇక ఆ తరువాత ఒక ఏడాదికి జీవనతరంగాలు వంటి సినిమాలలో నటించింది. ఇక ఆ తరువాత ఈమె చాలా బిజీ యాక్టర్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఆమెకు స్కూలు మొహమే చూడని విధంగా మారిపోయింది.

అలా షూటింగ్ సమయంలో ఒకరోజు కన్నడ దర్శకుడు శివమణి ని షూటింగ్ స్పాట్లో ఉదయం కలిసింది ఈమె. ఇక ఆ చిత్రం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో డైరెక్టర్ శివమణి వచ్చి ఆమె దగ్గరకు.. మీరంటే చాలా ఇష్టమని తెలియజేశాడట. నేను అందరి లాగా చాలా గొప్పవాడిని కాదు.. కానీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని ప్రపోజ్ చేయడం జరిగిందట. ఈ విషయాన్ని తన సోదరుడికి, తల్లికి చెప్పకుండా దాచి పెట్టిందట.

అలా ఉదయం కలిసి మాట్లాడుకొని సాయంత్రానికి ఆమె కూడా ఓకే చెప్పడంతో ఆ రోజు రాత్రి కల్లా వీరిద్దరు ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఇక వివాహమైన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మూడు కన్నడ సినిమాలలో తల్లి పాత్రలో నటించింది. ఈమె నటించిన సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం తన కుమారుడు సాయి తరుణ్ ని కూడా హీరో చేయాలని భావిస్తోంది.